Templates by BIGtheme NET
Home >> Cinema News >> అషు నెం.4 కి వేణు స్వామి ప్రత్యేక పూజలు

అషు నెం.4 కి వేణు స్వామి ప్రత్యేక పూజలు


టిక్ టాక్ కంటే ముందు వచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ డబ్ స్మాష్ తో జూనియర్ సమంత అంటూ పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి. ఆ తర్వాత టిక్ టాక్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ పాపులారిటీతో బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం మొదలు పెట్టింది.

ఈటీవీ మరియు మాటీవీ కార్యక్రమాల్లో అషు రెడ్డి సందడి చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి మరింతగా తన ఇమేజ్ ని పెంచుకుంది. అదే సమయంలో రామ్‌ గోపాల్‌ వర్మ తో ఇంటర్వ్యూ మరియు ఆయన తో సన్నిహిత్యం కారణంగా అషు రెడ్డికి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తు ఫాలోవర్స్ నమోదు అయ్యారు.

ఇప్పటికే తన గ్యారేజ్ లో మూడు కార్లను కలిగి ఉన్న అషు రెడ్డి కొత్తగా రేంజ్ రోవర్ కారును దాదాపుగా రూ.75 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది. కెరీర్‌ ఆరంభం లో ఒక నార్మల్‌ కారు ఉండేది. ఆ తర్వాత స్కోడా కొనుగోలు చేసింది. తన తండ్రికి బెంజ్ కారును కొని గిఫ్ట్‌ గా ఇచ్చిన అషు రెడ్డి ఇప్పుడు ఏకంగా రేంజ్‌ రోవర్‌ ను తన ఇంటికి తీసుకు వెళ్లింది.

తాజాగా తన నెం.4 కారు రేంజ్‌ రోవర్ కి వేణు స్వామితో పూజలు చేయించింది. సోషల్‌ మీడియా ద్వారా ఆ విషయాన్ని వేణు స్వామి షేర్ చేశాడు. అంతే కాకుండా మనల్ని అనుసరించే వాళ్లు మన సలహాలని పాటిస్తూ ముందుకు వెళ్లే వాళ్లని చూస్తే ఆ ఆనందం అంటూ కూడా అషు రెడ్డి విజయాల నేపథ్యం లో వేణు స్వామి పోస్ట్‌ చేశాడు.

అషు రెడ్డి సోషల్ మీడియా ద్వారా రెండు చేతులా సంపాదిస్తూ ఉంది. అంతే కాకుండా ఆమె సినిమాల్లో మరియు సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. రెండు మూడు చేతులా సంపాదిస్తున్న అషు రెడ్డికి రేంజ్‌ రోవర్‌ కొనుగోలు చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ కొందరు మాత్రం ఈ విషయమై ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ ను పట్టించుకోకుండా అషు తన పని లో తాను ముందుకు వెళ్తోంది.