సడెన్ పెళ్లి .. విద్యుల్లేఖ ఇలా చేస్తుందనుకోలేదు!

0

తమిళ నటి విద్యుల్లేఖ తెలుగు వారికి బాగా సుపరిచితం. తనదైన ఆహార్యంతో కమెడియన్ గా రాణించింది ఈ యంగ్ గాళ్. తమిళ్ నటి అయినప్పటికీ ఎక్కువగా టాలీవుడ్ లోనే బాగా ఫేమస్ అయ్యింది. సరైనోడు- రాజుగారి గది సహా పలు చిత్రాల్లో విద్యుల్లేఖ నటనకు మంచి గుర్తింపు దక్కింది. కోవై సరళ తర్వాత అంతగా పాపులరైన తమిళ కామెడీ నటి కూడా విద్యల్లేఖనే అని చెప్పాలి. 2018 నుంచి కెరీర్ పరంగా బిజీ నటిగా కొనసాగుతోంది.

అయితే ఉన్నట్టుండి విద్యుల్లేఖకు పెళ్లయిపోయింది! అంటూ కొన్ని వెడ్డింగ్ స్టైల్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవ్వడంతో అంతా ఖంగు తిన్నారు. విద్యు ఇదేమి సడెన్ ట్విస్టు? అంటూ ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అయ్యారు. అయితే వాటన్నిటికీ కొంత గ్యాప్ తర్వాత విద్యుల్లేఖ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 26న తనకు నిశ్చితార్థమైందని.. తన జిమ్ ట్రైనర్ సంజయ్ ని ప్రేమించి పెళ్లాడుతున్నానని ప్రకటించి హాట్ టాపిక్ గా మారింది. నవంబర్ లో ఈ జంట వివాహం జరగనుందట. ఇటీవల వైరల్ అయినవన్నీ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు అని తెలుస్తోంది.

ఉన్నట్టుండి ఏడాది కాలంగా విద్యుల్లేఖ జిమ్ కే అంకితమై బరువు తగ్గించుకునే ప్రయత్నం చేసింది. బాగా స్లిమ్మయి అందరికీ షాకిచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోల్ని కూడా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసేది. ఆ క్రమంలోనే జిమ్ కోచ్ తోనే ప్రేమలో పడిందట. మొత్తానికి లాక్ డౌన్ లో నిశ్చితార్థమైంది. నవంబర్ లో వివాహం జరగనుంది. పెళ్లి తర్వాతా ఈ భామ కెరీర్ ని యథాతథంగా కొనసాగించే వీలుందట.

బరువు తగ్గడంలో … ప్రేమ వివాహం చేసుకోవడంలో ఈ అమ్మడు అందరికీ స్ఫూర్తి అనే చెప్పాలి. వరుడు ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ నిపుణుదైన సంజయ్ తో విద్యుల్లేఖ డీప్ లవ్ లో ఉందని తెలిసింది. లేడీ కమెడియన్ గా తనదైన ముద్ర వేసిన విద్యుల్లేఖ సీనియర్ తమిళ టెలివిజన్ నటుడైన మోహన్ రామన్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే.