పెళ్లి ఆలస్యంకు కారణం చెప్పిన నయన్ ప్రియుడు

0

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గత కొంత కాలంగా విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. మొదట వీరిద్దు కూడా తమ ప్రేమ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కాని ఈమద్య కాలంలో వారు రెగ్యగులర్ గా సోషల్ మీడియాలో లేదంటే ఏదో ఒక బహిరంగ ప్రాంతాల్లో కనిపిస్తూ వారి ప్రేమను కన్ఫర్మ్ చేశారు. అయితే పెళ్లి విషయంలో మాత్రం వారు క్లారిటీ ఇవ్వడం లేదు. గత ఏడాది రెండేళ్ల కాలంగా పెళ్లి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉంది. కాని వీరు ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేరు.

నయన్ ఇప్పటికే శింబును ప్రేమించి బ్రేకప్ చెప్పింది.. ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమ వ్యవహారం కూడా తెగి పోతుందేమో అని అందుకే త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ కొందరు సూచిస్తున్నారు. అయితే పెళ్లి విషయంలో వారు చాలా క్లారిటీగా ఉన్నట్లుగా తాజాగా విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలతో అర్థం అవుతోంది.

చాలా మంది పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. త్వరలో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఇద్దరం కూడా కెరీర్ పై దృష్టి పెట్టి ఉన్నాం. తనకు కెరీర్ లో చాలా గోల్స్ ఉన్నాయి. అలాగే నాకు కూడా చాలా ఆశలు కోరికలు ఉన్నాయి. వాటి కోసం పెళ్లి తర్వాత ప్రయత్నించడం కంటే పెళ్లికి ముందే అనుకున్నవి అన్ని కూడా పూర్తి చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మేమిద్దరం పెళ్లి పై ప్రస్తుతం ఆలోచించడం లేదని విఘ్నేష్ శివన్ పేర్కొన్నాడు. ఇతడి మాటలతో వీరి పెళ్లికి ఇంకో రెండు మూడు ఏళ్లు అయినా పట్టవచ్చు అంటున్నారు.