సూపర్ స్టార్ లేడీ ఫ్యాన్ ల లవ్ స్టోరీ

0

తమిళ సూపర్ స్టార్ విజయ్ భార్య సంగీత గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఆమె మీడియా ముందుకు రావడం చాలా చాలా అరుదు. ఆమె మీడియాలో ఫోకస్ అయ్యేందుకు ఇష్టపడరు. పెళ్లి అయ్యి 20 యేళ్లు అయినా విజయ్ సంగీతల పెళ్లి విషయం గురించి చాలా మందికి ఇంకా పూర్తిగా తెలియదు. వారిది ప్రేమ వివాహం అనేది తమిళ ఇండస్ట్రీలోనే చాలా మందికి తెలియదు. విజయ్ తన ప్రేమ పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక ఆయన భార్య సంగీత కూడా పెద్దగా మీడియా ముందుకు రాలేదు కనుక వారి పెళ్లి గురించి కొద్ది మందికి మాత్రమే తెలిసింది.

చాలా మందికి తెలియని విషయం ఏంటీ అంటే విజయ్ తనను అభిమానించే సంగీతను మూడు సంవత్సరాలు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. విజయ్ కెరీర్ ఆరంభించినప్పటి నుండి కూడా సంగీత ఆయన్ను ఇష్టపడేది. లండన్ లో సెటిల్ అయిన ఒక తమిళ కుటుంబంకు చెందిన సాంప్రదాయ యువతిగా సంగీత పెరిగారు. అయితే ఆమెకు విజయ్ పై అభిమానంతో లండన్ నుండి చెన్నైవచ్చేసింది. తమిళ సినీ పరిశ్రమలో కనీసం ఒక్కరు అంటే ఒక్కరు కూడా తెలిసిన వాళ్లు లేరు. అయినా కూడా విజయ్ ను కలిసేందుకు ఆమె ప్రయత్నించింది.

తన కోసం లండన్ నుండి ఒక అభిమాని వచ్చిందని కలిసేందుకు తెగ ప్రయత్నిస్తుందని తెలుసుకున్న విజయ్ ఆమెతో లంచ్ కు సిద్దం అయ్యాడు. ఆ సమయంలో ఆమెతో మాట్లాడిన విజయ్ ఆ తర్వాత కూడా కంటిన్యూ చేశాడు. విజయ్ కి ఆమె పద్దతి నచ్చడం కుటుంబ సభ్యులకు కూడా ఆమె నచ్చడంతో లండన్ నుండి సంగీత కుటుంబ సభ్యులు రావడం వివాహం గురించి మాట్లాడటం జరిగింది. విజయ్.. సంగీతలు కలిసి మూడు సంవత్సరాల తర్వాత అంటే 1999లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు వీళ్లు తల్లిదండ్రులు అయ్యారు.