ఆ చబ్బీ లుక్కులో చిన్ని రౌడీ ఎంత క్యూట్ గా ఉన్నాడో..

0

చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చి ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ స్టార్గా పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. తన అభిమానులను ప్రేమగా రౌడీస్ అని పిలిచే విజయ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీలోనూ తన తమ్ముడి కెరీర్ను గాడి పెట్టే పనిలో ఉన్నాడు. విజయ్ దేవరకొండ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో అతడు వెండితెరకు పరిచయం అయ్యాడు. అతడు తొలి సినిమాతోనే ఆకట్టుకున్నాడు. ఆనంద్ తొలి సినిమా డివైడ్ టాక్ వచ్చినా మంచి అతడికి మాత్రం మంచి గుర్తింపే తెచ్చింది. ఆనంద్ తన రెండో చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ దర్శకత్వంలో ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’అనే సినిమాలో నటించాడు. వర్ష బొల్లమ్మ కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఆనంద్ దేవరకొండ తాజాగా చిన్ననాడు తన అన్న విజయ్ దేవరకొండ తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. దేవరకొండ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అతడి లేడీ ఫ్యాన్స్ కు మరింత నచ్చేసింది. ఆనంద షేర్ చేసిన ఆ ఫోటోలో విజయ్ కి కనీసం పదేళ్ళ వయసు కూడా లేదు. ఆ ఫోటోలో అతడు పాలబుగ్గల తో భలే క్యూట్ గా కనిపిస్తున్నాడు. అందులో విజయ్ ఓ బాల్ పట్టుకుని ఉండగా ఆనంద్ బ్యాట్ పట్టుకొని షాట్ కొడుతున్నట్లు పోజ్ ఇచ్చాడు. విజయ్ ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటినుంచి బక్కపలచగానే ఉన్నాడు. అర్జున్ రెడ్డి మూవీ లో పర్వాలేదనిపించినా.. గీతగోవిందం కల్లా మళ్లీ సన్నబడ్డాడు. ఆనంద షేర్ చేసిన ఫోటోలో విజయ్ చబ్బీ లుక్ అందరినీ కట్టి పడేస్తోంది. విజయ్ కి సంబంధించిన మంచి జ్ఞాపకాన్ని తమతో పంచుకున్నందుకు అతడి ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలిపారు.