రానా చెప్పిన గుడ్ న్యూస్..

0

పెళ్లి అయ్యింది ఈమద్యనే కదా అప్పుడే గుడ్ న్యూస్ ఏంటీ అంటూ ఆశ్చర్యపోతున్నారా.. ఇది ఆ గుడ్ న్యూస్ కాదు లేండి. దగ్గుబాటి అభిమానులు చాలా కాలంగా బాబాయి వెంకీ అబ్బాయి రానాల సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే సురేష్ బాబు మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా వెంకటేష్ రానాలతో సినిమాను తీస్తానంటూ పేర్కొన్నాడు. గతంలో వెంకీ మరియు రానాలు మంచి కథలు వస్తే కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించాడు. వీరు కథ అంటూ కాలం గడిపేస్తున్నారు. నిజంగా వీరిద్దరికి నటించే ఆసక్తి ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో రానా ఈ గుడ్ న్యూస్ ను ప్రకటించాడు.

సంతోషం పత్రిక అధినేత అయిన సురేష్ కొండేటికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రానా ఈ విషయాన్ని వెళ్లడించాడు. బాబాయితో సినిమా చేయడం కోసం చాలా రోజులుగా మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లాక్ డౌన్ టైంలో ఆ మంచి కథ దొరికింది అంటూ పేర్కొన్నాడు. అయితే ఇతర వివరాలు ఏమీ కూడా రానా తెలియజేయలేదు. కథ రెడీగా ఉంది కనుక ప్రస్తుతం వీరిద్దరు కూడా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి 2022 వరకు సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది.

రానా మరియు వెంకటేష్ ల కలయిక అంటే ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. రానా కథ దొరికింది అంటూ చెప్పడంతో దర్శకుడు ఎవరు.. ఎలా ఉంటుంది అనే చర్చ సాదారణంగానే మొదలు అవ్వడం ఖాయం. దగ్గుబాటి అభిమానులు ఆ విషయమై విపరీతంగా చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది దగ్గుబాటి మల్టీ స్టారర్ మూవీకి సంబంధించిన ప్రకటన ఏమైనా వచ్చే అవకాశం ఉందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.