బిబి స్పెషల్ ఎపిసోడ్ సమంత చీర జ్యువెలరీ ఖరీదు ఎంతంటే..!

0

రేటింగ్ లేక ఢీ లా పడ్డ బిగ్ బాస్ ను సమంత దసరా మారథాన్ ఎపిసోడ్ తో అమాంతం లేపింది. మూడు గంటల పాటు సాగిన బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ షో అంతటి సక్సెస్ ను దక్కించుకోవడానికి ప్రధాన కారణం సమంత అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. సమంత ఆ షో లో కనిపించిన తీరుతోనే షో ను చూస్తే బాగుండు అన్నట్లుగా అనిపించేలా చేశారు. ప్రోమో లో సమంత గెటప్ ను చూసిన ప్రేక్షకులు వావ్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో సమంత సెన్సాఫ్ హ్యూమర్ మరియు టైమింగ్ తో మెప్పించింది.

ఇక సోషల్ మీడియాలో సమంత చీర మరియు జ్యువెలరీ కాస్ట్ గురించి తెగ ప్రచారం జరిగింది. సమంత చీర గురించి తెగ చర్చ జరిగింది. లక్షల ఖరీదైన చీర అంటూ కొందరు ప్రచారం చేశారు. కాని సమంత ఆరోజు ఔట్ ఫిట్ గురించి డిజైనర్ మనోజ్ఞ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఆమె ఒక ప్రముఖ దిన పత్రికతో మాట్లాడుతూ ఆ రోజు సమంత కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడింది.

సమంత ఆ రోజున కట్టుకున్నది బనారస్ చీర. దాని విలువ రూ.44800.. ఇక ఆమె వేసుకున్న నగలు నిజంగా బంగారంతో చేసినవి. వాటి ఖరీదు రూ.35 లక్షలు. సమంత ఎలా ఉన్నా చాలా అందంగా ఉంటారు. కనుక ఆమెను మరింత అందంగా చూపించేందుకు తాను చాలా కష్టపడ్డట్లుగా మనోజ్ఞ చెప్పారు. సమంతకు మాత్రమే కాకుండా బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున స్టైలిష్ లుక్ కు కూడా మనోజ్ఞనే కారణం.