లాక్ డౌన్ తర్వాత అతి పెద్ద ‘ఆహా’ అనిపించే వేడుక

0

అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఓటీటీ మెల్ల మెల్లగా కంటెంట్ విషయంలో స్పీడ్ పెంచింది. మొదట్లో ఆహాలో కంటెంట్ అస్సలు ఉండటం లేదు అనే ఫిర్యాదు ఉండేది. కాని ఇప్పుడు సినిమాలు.. వెబ్ సిరీస్ లు.. టాక్ షోలు డబ్బింగ్ సినిమాలు ఇలా ఆహా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంది. ముందు ముందు మరింతగా కూడా ఆహా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దం అయ్యింది. ఆ విషయాన్ని ఈనెల 13వ తారీకున ఒక భారీ వేడుకను ఏర్పాటు చేసి ప్రకటించబోతున్నారు. ఆ విషయమై ఆహా అధికారికంగా ప్రకటించింది.

అల్లు అర్జున్ ప్రధాన గెస్ట్ గా ఆహా భారీ వేడుక జరుగబోతుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి నుండి ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా భారీ సినిమా వేడుక జరగలేదు. కనీసం ప్రెస్ మీట్ లు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. కరోనా భయం మెల్ల మెల్లగా తగ్గుతున్న ఈ సమయంలో సినీ వేడుకలకు కూడా ప్రభుత్వం నుండి అనుమతులు వస్తున్నాయి. ఆహాలో రాబోయే సంవత్సర కాలం పాటు స్ట్రీమింగ్ అవ్వబోతున్న కార్యక్రమాలు సినిమాలు మరియు ఇతర కార్యక్రమాలను అల్లు అర్జున్ తో అనౌన్స్ చేయించబోతున్నారు.

ఇదే సమయంలో ఆహా బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ను ప్రకటించే అవకాశం కూడా ఉందని మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఆహా కోసం పబ్లిసిటీ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు అల్లు అర్జున్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈనెల 13న భారీ ఎత్తున మెగా అభిమానులు ఈ కార్యక్రమంకు హాజరు అయ్యేలా ఇప్పటికే పాస్ లను కూడా జారీ చేశారట. ఆహా వేడుకతో మళ్లీ టాలీవుడ్ సినీ వేడుకలు పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

The grand event #AAPresentsAHA on NOVEMBER 13 from 5 PM onwards