నా మాటలు వక్రీకరించారు..పూజా హెగ్డే

0

కొన్ని రోజుల క్రితం హీరోయిన్ పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు నడుము అందం.. బొడ్డు చూపిస్తే చాలు అభిమానించేస్తారు అంటూ పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకుల గురించి తక్కువగా మాట్లాడింది అంటూ నెటిజన్స్ ఆమెను విమర్శించడం మొదలు పెట్టారు. తెలుగు ప్రేక్షకుల పట్ల అంతటి నీచమైన అభిప్రాయం ఉన్న పూజా హెగ్డేను తెలుగు సినిమాలో నటించనివ్వడం అవసరమా ఆమెను బ్యాన్ చేయాలంటూ కొందరు సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు. ఈ విషయం మరింత సీరియస్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఆమె స్వయంగా తెలుగులో ఒక పోస్ట్ ను షేర్ చేసింది.

పూజా హెగ్డే తన పోస్ట్ లో… ”నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు. నాకు ఎప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రాణసమానం.. ఇది నా చిత్రాలను అభిమానించే వారికీ నా అభిమానులకూ తెలిసినా.. ఎటువంటి అపార్ధాలకూ తావివ్వకూడదనే నేను మళ్ళీ చెబుతున్నా నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీ కి ఎప్పటికీ రుణపడిఉంటాను.. Watch the FULL interview. Thank you” అంటూ పేర్కొంది.

పూజా హెగ్డే తన ఇంటర్వ్యూను పూర్తిగా చూడమని వేరే విషయంలో తాను ఆ మాటలు అన్నాను అంటూ చెప్పడం జరిగింది. తెలుగు సినిమా పరిశ్రమ నాకు ప్రాణ సమానం అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఆమెను క్షమిస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈమె రాధేశ్యామ్ సినిమాతో పాటు అఖిల్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇదే సమయంలో ఈమె బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను చేసేందుకు ఆసక్తిగా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.