Templates by BIGtheme NET
Home >> Cinema News >> రౌడీ టూమచ్ కాస్ట్ లీ గురూ

రౌడీ టూమచ్ కాస్ట్ లీ గురూ


టాలీవుడ్ లో సినీనేపథ్యం లేకుండా స్వయంకృషి ప్రతిభతో ఎదుగుతున్న హీరోల జాబితా తిరగేస్తే అందులో విజయ్ దేవరకొండ పేరు టాప్ లో ఉంటుంది. రవితేజ- శ్రీకాంత్- నాని- నిఖిల్ తరహాలోనే దేవరకొండ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే హీరోగా దూసుకొచ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజును అందుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా అతడి స్థాయి అసమానంగా పెరిగింది.

ఇక ఎంతో సింపుల్ గా కనిపించే విజయ్ దేవరకొండ ఇటీవలే ఫిలింనగర్ పరిసరాల్లో ఓ సొంత ఇంటిని కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటి ఖరీదు 15 కోట్లు. దీంతో పాటే ఖరీదైన ఫ్యాన్సీ కార్లు.. బీఎండబ్ల్యూ కార్.. కాస్ట్ లీ అప్పారెల్ వస్తువులు విజయ్ దేవరకొండ సొంతం. సొంతంగా డిజైనర్ వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ యువాస్టార్ గా పాపులరయ్యారు.

అర్జున్ రెడ్డి సంచలన విజయంతో దేవరకొండ రేంజు అమాంతం పెరిగింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ విజయంతో మరో రేంజును అందుకున్నాడు. అతడి పారితోషికం స్థాయి నాలుగింతలయ్యింది. వాస్తవానికి అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సంచలన విజయం సాధించడం దేవరకొండ వైపు చూసేట్టు చేసిందంటే అతిశయోక్తి కాదు. అటు హిందీ అభిమానులు ఎవరా తెలుగు హీరో? అంటూ మన రౌడీ గురించి ఆరాలు తీసారు. ప్రస్తుతం అతడు కరణ్ జోహార్ టై అప్ తో పాన్ ఇండియా మూవీ ఫైటర్ లో నటిస్తున్నారు అంటే అది కబీర్ సింగ్ తో పెరిగిన ఇమేజ్ వల్లనే.

ఇంతగా ఎదిగేస్తున్న దేవరకొండ అస్సెట్స్ రేంజు ఎంత? అన్నది ఆరా తీస్తే తెలిసిన సంగతులివీ. వోన్ హౌస్ కాకుండా దేవరకొండ రెగ్యులర్ గా ఉపయోగించే ఐదు అత్యంత ఖరీదైన వస్తువుల వివరాలు పరిశీలిస్తే… BMW 5 సిరీస్ కార్ అతడి రేంజుకి చిహ్నం. విజయ్ దేవరకొండ గ్యారేజీలోని అనేక లగ్జరీ కార్లలో BMW 5 సిరీస్ సెడాన్ ఒకటి. విలాసవంతమైన ఇంటీరియర్స్ గొప్ప సేఫ్టీ ఫీచర్.. అసాధారణ సౌకర్యాన్ని అందించే బెస్ట్-ఇన్-క్లాస్ సెడాన్ కార్ ఇది. చాలా మంది బాలీవుడ్ టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇది ఉంది. ఈ కారు ధర రూ .60 లక్షలు.

ఖరీదైన ఫోర్డ్ ముస్తాంగ్ దేవరకొండ సొంతం. తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ముస్తాంగ్ జీటీని ప్రపంచంలో తనకు ఇష్టమైన కార్లలో ఒకటిగా ప్రకటించారు. విజయ్ ఈ కార్ కోసం రూ .75 లక్షలు వెచ్చించాడు.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ సి క్లాస్ కార్ తన గ్యారేజీలో ప్రత్యేకం. ఈ విలాసవంతమైన ఎస్ యూవీలో విజయ్ దేవరకొండ తరచుగా షూటింగులకు వెళ్లడమే గాక.. హైదరాబాద్ లో కొన్నిచోట్లకు పయనమవ్వడం అభిమానుల కంట పడింది. జిఎల్సి క్లాస్ మెర్సిడెస్ కార్ ధర రూ .60 లక్షలు.

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విజయ్ దేవరకొండ 15 కోట్ల విలువ చేసే ఇండివిడ్యువల్ ఇంటిని కొనుక్కున్నారు. ఇది శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ ఇంటికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ పెట్టుబడులన్నిటిపైనా విజయ్ దేవరకొండ చాలా హ్యాపీ.

ఫ్యాషన్ అండ్ స్టైలింగ్ కి సంబంధించిన బిజినెస్ అతడికి ఎంతో ఇష్టమైన వ్యాపకం. రౌడీ క్లబ్ పేరుతో వస్త్ర వ్యాపారంలో ప్రవేశించారు. 2018 లో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ క్లబ్ ను ప్రారంభించడానికి మైంత్రాతో చేతులు కలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టాలీవుడ్ లోనే సొంతంగా వస్త్ర శ్రేణి వ్యాపారాన్ని పరిచయం చేసిన మొదటి టాలీవుడ్ హీరోగా దేవరకొండ పేరు మార్మోగింది. ఇటీవలి కాలంలో ఆపిల్ యాప్ స్టోర్ – గూగుల్ ప్లే స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండే యాప్ ని ప్రారంభించినట్లు రౌడీ ప్రకటించారు. పూరి-కరణ్ కాంబినేషన్ లో ఫైటర్ మూవీలో నటిస్తున్న విజయ్ వరుసగా స్క్రిప్టుల్ని ఫైనల్ చేస్తున్నాడు. తదుపరి మరిన్ని వివరాల్ని వెల్లడించనున్నారని సమాచారం.