విడి11 మొదలయ్యేది అప్పుడేనా?

0

విజయ్ దేవరకొండ 10వ సినిమా ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆ సినిమాను త్వరలో పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అందరు హీరోలు దాదాపుగా సెట్స్ పైకి వెళ్లారు. ఈ సినిమా ప్రారంభించక పోవడానికి కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. త్వరలో పూరి సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలోనే విజయ్ దేవరకండా 11 సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే విజయ్ దేవరకొండ 11వ సినిమాకు శివ నిర్వాన దర్శకత్వం వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ సినిమా ఆర్మీ నేపథ్యంలో ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. శివ నిర్వాన గత సినిమాల్లో మాదిరిగానే ఒక విభిన్నమైన ప్రేమ కథను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమాను చేస్తున్న శివ నిర్వాన వచ్చే నెలలో సినిమా పనులు పూర్తి చేయనున్నాడు. ఇంతలో విజయ్ దేవరకొండ కూడా తన ఫైటర్ మూవీని పూర్తి చేసే అవకాశం ఉంది.

వీరిద్దరి కాంబో మూవీని వచ్చే మార్చిలో మొదలు పెట్టే విషయమై చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే మార్చిలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది చవరి వరకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా శివ నిర్వాన ప్లాన్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబో మూవీ అనగానే అంచనాలు భారీగా ఉన్నాయ. దర్శకుడు ఇప్పటి వరకు తెరకెక్కించిన నిన్నుకోరి మరియు మజిలీ సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి. కనుక రౌడీ స్టార్ కు కూడా తప్పకుండా ఒక మంచి సినిమాగా శివ నిర్వాన సినిమా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.