ఆ సినిమా రిజల్ట్ ను బట్టి సూపర్ స్టార్ నిర్ణయం

0

థియేటర్లు మూత పడ్డ కారణంగా బాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. చిన్నా పెద్ద కలిసి అక్కడ చాలా సినిమాలో ఓటీటీ దారి పట్టాయి. అయితే సౌత్ లో మాత్రం పెద్ద హీరోల సినిమాలు ఇన్ని రోజులు ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపించలేదు. కాని ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకున్న మేకర్స్ మరియు స్టార్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. తెలుగులో నాని ‘వి’ సినిమా విడుదలను ప్రకటించిన విషయం తెల్సిందే. అటు తమిళ స్టార్ హీరో సూర్య కూడా తన ఆకాశమే నీహద్దురా సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్దం అయినట్లుగా అఫిషియల్ గా ప్రకటించాడు.

సూర్య నటించిన ఈ చిత్రంను అమెజాన్ లో వచ్చే నెల 30వ తారీకున విడుదల చేయబోతున్నారు. దాంతో ఇతర తమిళ స్టార్ హీరోలు కూడా ఓటీటీ వైపు ఆసక్తి చూపించే అవకాశం ఉందంటున్నారు. థియేటర్లు ఇప్పట్లో తెరుకోవని ఒక వేళ తెరుచుకున్న వసూళ్ల విషయంలో ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని అంటున్నారు. అందుకే ముందు ఉన్న ఓటీటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. సూర్య చిత్రం తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

భారీ బడ్జెట్ సినిమాలకు సౌత్ లో ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాన్ని ‘ఆకాశమే నీ హద్దురా’ విడుదలతో చూసి ఆ తర్వాత విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. విజయ్ ఈమద్య కాలంలో నటించిన ప్రతి సినిమా కూడా వంద కోట్లను దాటింది. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా థియేటర్ లో విడుదల అయితే మినిమం 250 కోట్లను వసూళ్లు చేసేది అనేది ఆయన అభిమానుల మాట. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్థాయి వసూళ్లు అంటే మరో ఏడాది పాటు వెయిట్ చేయాల్సి రావచ్చు. అందుకే ఓటీటీ విడుదలకు విజయ్ మొగ్గు చూపే అవకాశం ఉందని సూర్య సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే దాన్ని బట్టి విడుదల ప్లాన్ చేస్తాడని అంటున్నారు.