Templates by BIGtheme NET
Home >> Cinema News >> తమన్నాతో ఛార్టడ్ ఫ్లైట్ లో విరాట్ కోహ్లీ!

తమన్నాతో ఛార్టడ్ ఫ్లైట్ లో విరాట్ కోహ్లీ!


విరాట్ కోహ్లీ – మిల్కీ బ్యూటీ తమన్నా.. ఒక చార్టడ్ ఫ్లైట్ లో ప్రయాణించారనే ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫొటో చూస్తే.. నిజంగానే అక్కడున్నది కోహ్లీనే! ఇదెలా సాధ్యమైందీ? అని ఫ్యాన్స్ బుర్ర గోక్కుంటున్నారు. కొంత మంది ఇది పాత ఫొటో అయి ఉంటుందని అంటున్నారు. పాత ఫొటో అయితే కావొచ్చు.. తమన్నాతో కలిసి ఎక్కడికి వెళ్తాడు? అని ఒకటే డిస్కషన్ నడుస్తోంది.

నిజానికి.. వీరిద్దరూ 2012లో ఒక యాడ్ లో కలిసి నటించారు. దీంతో.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు గట్టిగానే వినిపించాయి. కానీ.. అదేం లేదని క్లారిటీ ఇచ్చింది తమన్నా.. కేవలం యాడ్ సమయంలో తప్ప తాము ఎప్పుడూ కలవలేదని కనీసం మాట్లాడుకోలేదని స్పష్టం చేసింది మిల్కీ బ్యూటీ.

మరి ఈ ఫొటో ఎక్కడిది? అని అనుకుంటుండగా.. ఆ పోస్టులోనే చిన్న క్లూ ఇచ్చింది తమన్నా. ఆ ఫొటోను ఫ్లైట్ లో ఉన్నవారి పేర్లకు ట్యాగ్ కూడా చేసింది. ఆ విధంగా.. అందులో ఉన్నది విరాట్ కాదని తేలిపోయింది. ఆ ఫ్లైట్ లో తనతో హెయిర్ డ్రెస్సర్ మేకప్ ఆర్టిస్టులు మాత్రమే ఉన్నారని కూడా కామెంట్ రాసింది.

ఈ ఫొటో.. ఈ మధ్యనే ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తీసిందట. మొత్తానికి కోహ్లీ మాదిరిగానే కనిపించిన మేకప్ ఆర్టిస్టు అందరినీ బోల్తా కొట్టించాడు. మీరు కూడా పొరబడే ఉంటారు కదూ..!