వినాయక్ కంబ్యాక్ మామూలుగా లేదండోయ్..!

0


టాలీవుడ్ లో మాస్ ఎంటర్ టైనర్లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు వి.వి.వినాయక్. కొన్ని వరుస పరాజయాల తర్వాత `ఖైదీనంబర్ 150` చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీని అదిరిపోయే రేంజులోనే డిజైన్ చేయగలిగారు. కానీ ఆ తర్వాత మాత్రం సక్సెస్ దక్కలేదు. దీంతో కెరీర్ పరంగానూ ఆయన రేస్ లో బ్యాక్ బెంచీకి పరిమితం అయ్యారు.

ఆ క్రమంలోనే తనకు నిర్మాతగా డెబ్యూ బ్లాక్ బస్టర్ ని ఇచ్చినందుకు రుణం తీర్చుకునేందుకు దిల్ రాజు స్వయంగా బరిలో దిగి వినాయక్ ని హీరోని చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం ఎందుకనో సఫలం కాలేదు. మధ్యలోనే ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఆ తర్వాత వినాయక్ ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్నకు ఇన్నాళ్టికి మళ్లీ ఆన్సర్ దొరికింది.

అన్నయ్య చిరంజీవి మరోసారి వినాయక్ కి ఆపన్న హస్తం అందిస్తున్నారు. మలయాళ చిత్రం `లూసిఫెర్` రీమేక్ నుండి సుజీత్ వైదొలగడంతో ఆ స్థానంలో వినాయక్ వచ్చి చేరారు. మరోసారి చిరంజీవిని డైరెక్ట్ చేసే రేర్ ఛాన్స్ కొట్టేశారు. అయితే అంతటితో వినాయక్ సరిపెట్టుకోవడం లేదు. ఈ లాక్ డౌన్ లో వరుసగా స్క్రిప్టులు రెడీ చేసి వార్ కి రెడీ అయ్యారన్న గుసగుస వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. అతను బాలయ్యకు కథను వినిపించాడు. కథ నచ్చింది. పూర్తి స్థాయి కథనం రెడీ చేయాల్సిందిగా కోరారట. వినాయక్ బౌండెడ్ స్క్రిప్ట్తో బాలయ్యను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టే కుదిరితే చిరంజీవి సినిమాతో పాటు బాలయ్యతోనూ మూవీని పట్టాలెక్కించే అరుదైన అవకాశం వినాయక్ ముందు ఉంది.