`ఆచార్య` టీమ్ పై త్రిష షాకింగ్ కామెంట్

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కథానాయిక విషయంలో రకరకాల కథనాలు ఆరంభమే వేడెక్కించాయి. అయితే అప్పట్లో తనకు తానుగానే ఈ మూవీ నుంచి తప్పుకున్నానని త్రిష క్లారిటీనిచ్చింది. ఇదే వివాదంపై త్రిష మళ్లీ స్పందించింది. ఇందులో ముందు హీరోయిన్ గా త్రిషని చిత్ర బృందం ఫైనల్ చేయగా.. షూటింగ్ ప్రారంభించడానికి ముందే తాను తప్పుకుని షాకిచ్చింది.

మేకర్స్ స్వయంగా ఆమెను తొలగించారని ప్రచారమైంది. కానీ త్రిష మాత్రం తనకు చిత్ర బృందానికి కొన్ని సృజనాత్మక విభేధాల కారణంగా తాను ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చానని వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో టీమ్ షాక్ కు గురైంది. అయితే త్రిషే ఈ మూవీ నుంచి కావాలని తప్పుకుందని కొంత మంది చెప్పుకొచ్చారు.

“కొన్ని విషయాలు మనం ఊహించినట్టుగా జరగవు. నచ్చని విషయాల్ని భరిస్తూ వుండలేం. ఆ కారణం వల్లే తాను `ఆచార్య` నుంచి బయటికి వచ్చినట్టు త్రిష క్లారిటీ ఇచ్చింది. `ఆచార్య` బృందానికి నేను శుభాకాంక్షలు చెబుతున్నాను. వీలైనంత త్వరగా మంచి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నాను“ అని త్రిష తాజాగా ట్వట్ చేయడం ఆసక్తికరంగా మారింది.