ప్రభాస్ మహేష్ పవన్ లతో నటించాలని ఉంది: యంగ్ హీరోయిన్

0

యంగ్ హీరోయిన్ పాయల్ రాజపుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు కుర్రకారు మనసులు కొల్లగొట్టింది ఈ పంజాబీ బ్యూటీ. తన ఫస్ట్ సినిమాలోనే తన అందాల ఆరబోతతో.. బోల్డ్ క్యారెక్టర్లో ఒదిగిపోయి పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇటీవలే వెంకీ మామ సినిమాలో వెంకటేష్ తో ఆడిపాడినా ఎందుకో క్రేజ్ రాలేదు. ఇక డిస్కోరాజా RDX లవ్ లాంటి సినిమాలు ఇలా వచ్చి ప్లాప్ అయి అలా వెళ్లిపోయాయి. దాంతో ఎలాగైనా ఇక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని గట్టిగానే ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవలే తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా.. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. అతడిని తన అభిమానులకు పరిచయం చేసి కుర్రాళ్ళ గుండెల్ని బ్రేక్ చేసింది.

ఇదిలా ఉండగా.. ఆర్ఎక్స్ 100 మూవీతో మంచి విజయం అందుకున్న తర్వాత ఈ పాయల్ మరో భారీ విజయాన్ని అందుకోలేక పోయింది. తాజాగా ఈ భామ తన ఇష్టాలను బయట పెట్టింది. తనకు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు ప్రభాస్ పవన్ కళ్యాణ్ లతో నటించాలని ఉన్నట్లు తన కోరికను మీడియా పరంగా చెప్పేసింది. ప్రస్తుతం అమ్మడు మీడియం రేంజ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటుంది. అయితే ఏదొక రోజు స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం వస్తుందని మాత్రం గట్టి నమ్మకమే పెట్టుకుంది భామ. నిజానికి పాయల్ తప్పకుండా ఆమె కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కించే సినిమాలు చేస్తే బాగుంటుంది. అప్పుడే ఆమెకు స్టార్ హీరోలతో పనిచేసే ఛాన్స్ వస్తుందని సినీవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఏదేమైనా పాయల్ కోరిన విధంగా ఆమె కెరీర్ మలుపు తీసుకుంటుందని నెటిజన్లు విష్ చేస్తున్నారు.