నివేదను రీప్లేస్ చేయడానికి కారణమేమిటి?

0

తనదైన అందం నటనతో తెలుగు లోగిళ్లలో ఇప్పటికే చక్కని ఫాలోయింగ్ తెచ్చుకుంది నివేద పెథురాజ్. `అల వైకుంఠపురములో` లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రంలో కవ్వించే నటనతో ఆకట్టుకుంది. మరీ లెంగ్తీ రోల్ కాకపోయినా నివేద కనిపించిన ఫ్రేమ్ కి వెయిట్ పెరిగిందన్న ప్రశంసా దక్కింది.

సాయి తేజ్ సరసన చిత్రలహరి లాంటి హిట్ చిత్రంలోనూ నివేద పెథురాజ్ నటించింది. వరుసగా ఈ అమ్మడు తెలుగు సినిమాలకు కమిటవుతోంది. అయితే ఉన్నట్టుండి సాయి తేజ్ మూవీ నుంచి ఈ అమ్మడిని తొలగించాన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. అలా ఎందుకు జరిగింది? అంటూ ఆరాలు మొదలయ్యాయి.

మెల్లిగా తెలుగులో అండర్ డాగ్ మాదిరి పాగా వేస్తున్న ఐశ్వర్య రాజేశ్ మెగా మేనల్లుడి సరసన ఆఫర్ దక్కించుకుంది. నివేద స్థానంలో తనని ఎంపిక చేశారని తెలుస్తోంది. సాయితేజ్ – దేవకట్టా కాంబోలో వస్తున్న సినిమాలో ఈ బ్యూటీని హీరోయిన్ గా సడెన్ ఎంట్రీ ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే కాకుండా మరో రెండు తెలుగు సినిమాల్లోను ఐశ్వర్య రాజేష్ నటిస్తోందట. ఇక నివేద .. రామ్ సరసన రెడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసినదే. ఆ మూవీ రిలీజ్ కి రావాల్సి ఉంది.