కుమార్తె ప్రమోషన్ లో సురేఖావాణి బిజీ!

0

ఫేమస్ అయిపోవాలంటే సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్ గా మారింది. సోషల్ మీడియాని చాలా మంది చాలా రకాలుగా వినియోగించేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూడా అందరిలానే సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారు. వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే తెగ వైరల్ గా అవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. నిత్యం తనతో పాటు తన కూతురు కూడా లైమ్ లైట్ లో వుండాలని తాపత్రయపడుతున్నారు.

రీల్ లైఫ్లో అక్కగా ..అత్తగా . వదినగా అలరిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకున్న సురేఖాణి రియల్ లైఫ్ లో తన కూతురుతో కలిసి మోడ్రన్ డ్రెస్సుల్లో ఆకట్టుకుంటున్నారు. ఎట్రాక్టివ్ ఫొటోలతో పాటు డ్యాన్స్ తో హంగామా చేసిన వీడియోలని కూడా ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు. దీంతో తల్లీ కూతుళ్లు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారిపోయారు. అంతేనా టిక్ టాక్ లో పంచె కట్టుతో అదరగొట్టేశారు.

అన్ లాక్ ప్రక్రియలో భాగంగా షూటింగ్ లు ప్రారంభం కావడంతో ఓ మూవీ షూటింగ్ కోసం సురేఖా వాణి జైపూర్ వెళ్లారు. వెళుతూ వెళుతూ తన వెంట తన ముద్దుల కూతుర్ని కూడా తీసుకెళ్లారు. తిరిగి వచ్చాక వరుస పార్టీలతో మళ్లీ హంగామా చేయడం మొదలు పెట్టారామె. విజయదశమి ఫెస్టివల్ సందర్భంగా కూతురితో కలిసి గోవా వెళ్లారు. అక్కడి బీచ్లో తల్లీ కూతుళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. క్లబ్బులు.. పబ్బులు అంటూ ప్రతీ చోట సందడి చేశారు. మోడ్రన్ డ్రెస్ లో కూతురితో కలిసి సురేఖావాణి చేస్తున్న సందడి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.