Templates by BIGtheme NET
Home >> Cinema News >> అన్ని భాషల్లో `బాహుబలి`కైనా కష్టమే కదా?

అన్ని భాషల్లో `బాహుబలి`కైనా కష్టమే కదా?


పదకొండు భాషల్లో రజనీకాంత్ `రోబో` కానీ .. రాజమౌళి `బాహుబలి` కానీ రిలీజయ్యాయా? 2.0 లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా అయినా రిలీజైందా? అంత గట్ ఫీలింగ్ ఎవకైనా ఉందా? కానీ ఆర్జీవీకి అది ఉందనే అతడి ప్రయత్నం చెబుతోంది. చింత చచ్చినా పులుపు చావలేదు! అన్న చందంగా.. డీగ్రేడ్ సినిమాలతో ఇప్పటికే ప్రపంచమంతా బ్యాడ్ అయిపోయినా ఆర్జీవీ ఎందులోనూ తగ్గడం లేదు. ఆయన రోజురోజుకి వెయిట్ పెంచేస్తున్నాడు. తన రేంజు డబుల్ ట్రిపుల్ టెన్ టైమ్స్ అంటూ చెలరేగుతున్నాడు. ఆయాచితంగా అందివచ్చిన ఏటీటీని అందుకు పక్కాగా వాడేస్తున్నాడు. సినిమా చూశారా లేదా అన్నది కాదన్నయ్యా.. రిలీజ్ చేసామా లేదా? అన్నట్టుగానే ఉంది ఆయన తీరు. జక్కన్న.. శంకర్ లాంటి వాళ్లే మూడు నాలుగు భాషల్లో సినిమాల్ని రిలీజ్ చేయాలంటే మూడు చెరువుల నీళ్లు తాగేస్తున్నారు. అలాంటిది ఆర్జీవీ ఈ ప్రయత్నంతో ఔరా! అనిపించేస్తున్నాడు.

ఏటీటీ ప్లాట్ ఫామ్ అంటూ సొంతంగా ఆన్ లైన్ థియేటర్ ప్రారంభించి దానికి టిక్కెట్టు ధరను నిర్ణయించి మరీ సినిమాల్ని అమ్మేస్తున్నాడు. సగం సినిమా తీసినా.. లేదా కొన్ని సీన్లతో సినిమా అని వాదించినా ఆయనకే చెల్లింది. ప్రచారార్భాటంతో మీడియాల్ని వెంట తిప్పుకుని తనకు కావాల్సినది దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న `పవర్ స్టార్` ఏటీటీ రిలీజ్ మొదలు రాబోవు అరడజను సినిమాలను ఇదే రీతిన అమ్మేసే ప్రణాళికలో ఉన్నాడు.

ఆర్జీవీ తదుపరి చిత్రం `థ్రిల్లర్` అయితే ఏకంగా 11 భాషల్లో రిలీజవుతోందట. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో దీనిని రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే అప్సర రాణి .. రాక్ కచ్చి రొమాంటిక్ ఫోజులు యూత్ లో వైరల్ అయ్యాయి. ఆగస్టు 14 రాత్రి 9 గంటలకు డిజిటల్ రిలీజ్ చేయనున్నారు. భారతీయ ప్రేక్షకులు ఒక్కో వీక్షణకు రూ.200 చెల్లించాల్సి ఉండగా.. విదేశీ ప్రేక్షకులు ఒక్కో వీక్షణకు 999.99 చెల్లించాలట. తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ- బెంగాలీ- ఒడియా- భోజ్పురి- మరాఠీ- గుజరాతీ- పంజాబీలతో సహా 11 భారతీయ భాషల్లో ఆర్జీవీ థ్రిల్లర్ విడుదలవుతోంది. జక్కన్న.. శంకర్ కి అయినా ఇలాంటి రికార్డు ఇప్పట్లో సాధ్యం కాదేమో ఆర్జీవీ?