వచ్చే ఏడాదిలో అయినా సమంత వచ్చేనా?

0

గత ఏడాది తెలుగు మరియు తమిళంలో కలిపి మూడు చిత్రాలను సమంత చేసింది. ఈ ఏడాదిలో జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాను కూడా గత ఏడాదిలోనే పూర్తి అయ్యింది. కనుక 2020 సంవత్సరంలో సమంత ఒక్క సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనలేదు. ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 షూటింగ్ లో కొన్ని రోజులు ఈమె పాల్గొంది. ఇక గత అయిదు నెలలుగా కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్స్ లేకపోవడంతో టెర్రస్ గార్డెన్ పై ఆమె దృష్టి పెట్టింది. దాంతో పాటు సమంత యోగా ట్రైనింగ్ తీసుకుంటుంది.

ఈ ఏడాదిలో షూటింగ్స్ ప్రారంభం అయ్యేది లేనిది తెలియడం లేదు. ఇప్పటి వరకు కరోనా అదుపులోకి రాకపోవడంతో మరికొన్ని నెల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో సమంత కూడా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో షూటింగ్స్ కు ఇప్పట్లో హాజరు కాలేనంటూ చెప్పేసిందట. ఫ్యామిలీ మెన్ షూటింగ్ జరుగుతున్నా కూడా సమంత హాజరు కావడం లేదని టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో ఈమె రెండు తమిళ సినిమాల షూటింగ్స్ లో పాల్గొనాల్సి ఉన్నా కూడా ఆమె మాత్రం బయటకు వెళ్లడం లేదట.

అక్టోబర్ వరకు పరిస్థితులు అదుపులోకి వస్తే ఆ తర్వాత షూటింగ్స్ లో జాయిన్ అవ్వాలని సమంత భావిస్తుందట. ఒక వేళ అప్పటికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఏడాది ఆరంభం నుండి షూటింగ్ లో సమంత జాయిన్ అవుతుందని అంటున్నారు. ఒక వేళ సమంత ఈ ఏడాదిలో కెమెరా ముందుకు రాకుంటే వచ్చే ఏడాదిలో కూడా ఆమె సినిమాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. సమంత అభిమానులకు ఇది నిరాశను కలిగించే వార్త. అయితే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో వచ్చే ఏడాది సమంత వచ్చే అవకాశం ఉందంటున్నారు.