ఈ స్టార్ హీరోస్ పాన్ ఇండియా ఫైట్ అదిరిపోనుందా..??

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో రోజురోజుకి పాన్ ఇండియా మూవీస్ సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలుగా వెలుగుతున్న ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా అనే స్టార్డం పై కన్నేసినవారే. పాన్ ఇండియా వైడ్ ఫేమ్ సొంతం చేసుకోవాలనే రేంజిలో తమని తాము సవాల్ చేసుకుంటున్నారు హీరోలు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి డార్లింగ్ ప్రభాస్ మాత్రమే పాన్ ఇండియా స్టార్ అనే ఫేమ్ తో పాటు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే అభిమాన హీరోలు సినిమాల నుండి ఎప్పుడైతే అధికారిక ప్రకటనలు వెలువడుతాయో ఆ టైంలో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఇదివరకు చెప్పినట్లుగా డార్లింగ్ ప్రభాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల సినిమాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్నాయని అర్ధమవుతుంది.

ఈ కాంబినేషన్ లో బిగ్ ఫైట్ జరగనుంది అంటే అభిమానులకు విందు భోజనం పెట్టినట్లే. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సలార్ మూవీ వచ్చే ఏడాది అంటే 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. సలార్ విడుదలైన 15రోజులకు కొరటాలతో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాబట్టి.. ఎన్టీఆర్ మూవీ ఏప్రిల్ 29కి విడుదల కాబోతుందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్.. అందుకే ప్రేక్షకులు అతడి సినిమాలను ఈజీగా ఓన్ చేసుకోగలరు. కాబట్టి ఎన్టీఆర్ సినిమా పోటీకి రావడం అనేది పెద్ద ప్రాబ్లెమ్ కాదు. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో ఇది రెండో సినిమా అదికూడా పాన్ ఇండియా మూవీ. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్డం అందుకుంటాడు. కాబట్టి కొరటాల సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఏం జరగనుందో..!