హాలీవుడ్ రేంజ్ భారీ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తున్నారట

0

హాలీవుడ్ లో రూపొందే భారీ యాక్షన్ సినిమాలు అయిన అవైంజర్స్ తో పాటు ఇంకా కొన్నింటికి ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ ఉంటుంది. అందుకే అలాంటి ఒక భారీ యాక్షన్ మల్టీ స్టారర్ ను నిర్మించేందుకు 50 ఇయర్స్ ఇండస్ట్రీ యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ప్లాన్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆ భారీ యాక్షన్ మల్టీ స్టారర్ కు సంబంధించిన చర్చలు ప్రారంభం అయ్యాయి. అవైంజర్స్ రేంజ్ లో బాలీవుడ్ మూవీ ఉంటుందని వారు అంటున్నారు.

50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా భారీ సినిమాలను నిర్మించబోతున్నట్లుగా ఇప్పటికే యశ్ రాజ్ సంస్థ వారు ప్రకటించారు. అయిదు ఆరు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన ఈ సంస్థ మొదటగా వచ్చే ఏడాదిలో షారుఖ్ ఖాన్ తో నిర్మిస్తున్న పఠాన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ తర్వాత ఈ హాలీవుడ్ రేంజ్ మూవీని పట్టాలెక్కించబోతున్నారట. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్.. దీపిక పదుకునే.. కత్రీనా కైఫ్ లను ఇప్పటికే ఈ భారీ యాక్షన్ ఎడ్జ్వెంచర్ మూవీ కోసం సంప్రదించారట. కనీసం రెండేళ్ల పాటు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.

హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హీరోస్ సినిమాల తరహాలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. హాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు దాదాపుగా వెయ్యి కోట్లను ఖర్చు చేసేందుకు కూడా యశ్ రాజ్ సంస్థ సిద్దంగా ఉందంటున్నారు. ఇండియన్ స్క్రీన్ పై రాబోతున్న అతి పెద్ద మల్టీస్టారర్ కమ్ భారీ బడ్జెట్ సినిమాగా ఇది నిలిచే అవకాశం ఉంది.