సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యువ హీరో…!

0

టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటూ మంచి నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంటుంది సితార ఎంటర్టైన్మెంట్స్. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ ని పరిచయం చేస్తూ.. కొత్త కథలను వెండితెర మీదకు తీసుకొస్తూ సూర్యదేవర నాగవంశీ మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ తో ‘రంగ్ దే’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నాడు. న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుండే ఈ బ్యానర్ లేటెస్ట్ గా మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విమల్ కృష్ణ అనే డైరెక్టర్ తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ‘గుంటూరు టాకీస్’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. క్రైమ్ కామెడీగా రానున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. సినిమా విషయంలో క్రియేటివ్ డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడనే పేరున్న నాగవంశీ.. ఈ ప్రాజెక్ట్ తో మరో హిట్ ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.