అదరగొట్టిన ‘రెడ్‌మీ K20’ ఫోన్లు

0

రెడ్‌మీ కె సిరీస్‌ ఫోన్లతో షామీ తొలిసారిగా డార్క్‌మోడ్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. వీటిలో హరైజాన్‌ ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఉంటుంది. రెడ్‌మీ నుంచి వస్తున్న తొలి ఆమోలెడ్‌ డిస్‌ప్లే సిరీస్‌ ఇదే. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ మొబైళ్లు మన దేశంలో ఈ నెల 22 నుంచి సేల్‌కి వస్తున్నాయి. అత్యుత్తమ గేమింగ్‌ అనుభూతి కోసం రెండో తరం గేమ్‌ టర్బోను తీసుకొస్తున్నారు. ఎన్‌హాన్స్‌డ్‌ విజువల్స్‌ 2.0 ఫీచర్‌తో గేమింగ్‌లో నైట్‌ విజన్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5తో త్రీడీ కర్వ్‌డ్‌ గ్లాస్‌ బ్యాక్‌ ఉంటుంది. దీని పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరాను మూడు లక్షల సార్లు వాడినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ మొబైళ్లను 15 నిమిషాల ఛార్జింగ్‌ పెడితే 10 గంటలపాటు 4జీ కాల్స్‌ మాట్లాడొచ్చు. 30 నిమిషాల్లో 58 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌ సౌకర్యం ఉంటుంది.

రెడ్‌మీ కె20 ప్రో ప్రత్యేకతలు

* 6.39 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
* 91.9 స్క్రీన్‌ టు బాడీ రేషియో
* LPPDDR4X ర్యామ్‌, UFS 2.1 స్టోరేజీ
* 8 లేయర్‌ గ్రాఫైట్‌ కూలింగ్‌ సిస్టమ్‌
* 191 గ్రాముల బరువు
* 7 నానోమీటర్‌ టెక్నాలజీ
* వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌
* 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 586 కెమెరా,
* 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా
* 8 ఎంపీ టెలీఫొటో కెమెరా
* 960 ఎఫ్‌పీఎస్‌ స్లోమోషన్‌ వీడియో
* 4కె వీడియో 60 ఎఫ్‌పీఎస్‌ వరకు
* 20 ఎంపీ పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరా
* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* 27 వాట్స్‌ సోనిక్‌ ఛార్జ్‌.
* పీ2ఐ స్ప్లాష్‌ ప్రూఫ్‌

(గమనిక: రెడ్‌మీ కె20 ప్రోలో ఉన్న అన్ని ఫీచర్లు రెడ్‌మి కె20లో ఉంటాయి. అయితే ఇందులో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730 ప్రాసెసర్‌ ఉంటుంది)

ఈ నెల 22న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మి.కామ్‌, మి హోమ్‌ స్టోర్లలో ఈ ఫోన్లు లభ్యమవుతాయి. ఈ సమయంలో ఐసీసీఐ కార్డుతో పేమెంట్‌ చేస్తే ₹ 1,000 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఈ మొబైల్స్‌ ప్రచారంలో భాగంగా ఆల్ఫాసేల్‌ పేరుతో రెడ్‌మీ తాజాగా ఓ సేల్‌ నిర్వహించింది. ₹855 చెల్లించి వోచర్‌ కొనుగోలు చేసినవారికి ముందుగా ఫోన్‌ కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. వారు ఈ రోజు రాత్రి 8 గంటలకు ఫోన్‌ను కొనొచ్చు. వారు ఐసీసీఐ కార్డుతో పేమెంట్‌ చేస్తే ₹ 2,000 క్యాష్‌ బ్యాక్‌ కూడా వస్తుంది. ఆల్ఫాసేల్‌లో పాల్గొనని వారు 18న మిహోమ్‌ స్టోర్‌కి వెళ్లి ఫోన్‌ కొని ఈ ఆఫర్‌ పొందొచ్చు.

రెడ్‌మీ కె20 ప్రో 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్‌ ధర ₹ 27,999. 8 జీబీ ర్యామ్‌, 256 అంతర్గత మెమొరీ వెర్షన్‌ ధర ₹ 30,999. అదే రెడ్‌మీ కె20 చూస్తే.. 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ధర ₹ 21,999. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్‌ ధర ₹ 23,999గా షామీ నిర్ణయించింది.

గోల్డ్‌ ఎడిషన్‌
రెడ్‌మీ కె20 ప్రోలో స్పెషల్‌ ఎడిషన్‌ను కూడా రెడ్‌మీ రూపొందించింది. ఇది పూర్తిగా బంగారం, వజ్రాలతో తయారు చేశారు. దీని తయారీకే సంస్థకు ₹ 4,80,000 ఖర్చయ్యింది. ఇలాంటివి కేవలం 20 మాత్రమే రూపొందించారు. అయితే దీని అమ్మకం విలువ మాత్రమే సంస్థ ప్రకటించలేదు. త్వరలో దీనిపై మరింత స్పష్టత వస్తుంది.