రిషీకేష్ లో ఆ వంతెన దగ్గర హటాత్తుగా బట్టలు తీసేసిన విదేశీ మహిళ

0

రోమ్ కు వెళ్లినప్పుడు రోమన్ లా ఉండాలన్న ఇంగ్లిషు నానుడి తెలిసిందే. ఏ దేశానికి వెళతామో.. ఏ ప్రాంతానికి వెళతామో.. అక్కడి తీరు తెన్నుల గురించి తెలుసుకొని మసలుకోవాలి. లేకుంటే.. మొదటికే మోసం రావటం ఖాయం. భారతదేశానికి వచ్చే విదేశీయులు.. ఇక్కడి కల్చర్ గురించి.. ఇక్కడి విధానాల గురించి అవగాహనతోనే వస్తారు. అందునా.. యూరోప్.. అమెరికా నుంచి వచ్చే వారు మరిన్ని వివరాలు సేకరించుకున్నాకే వస్తారు. తాజాగా ఫ్రెంచ్ మహిళ ఒకరు ప్రముఖ పుణ్యక్షేత్రమైన రిషికేశ్ లో చేసిన పని అక్కడి వారిని షాక్ తినేలా చేయటమే కాదు.. కేసును ఎదుర్కొనే వరకు వెళ్లింది.

స్థానిక చట్టాల గురించి.. ఇక్కడి పరిస్థితుల గురించి తెలీకనే తాను అలా చేసినట్లుగా ఆమె చెబుతున్నారు. ఫ్రాన్స్ కుచెందిన ఒక మహిళ ఉత్తరాఖండ్ లోని రిషీకేష్ కు వచ్చారు. అక్కడి ప్రముఖ టూరిస్టుస్పాట్ అయిన లక్ష్మణ్ ఝులా బ్రిడ్జి దగ్గరకు వెళ్లారు. అక్కడి రమణీయత ఆమెకు నచ్చిందేమో కానీ.. వెంటనే ఆమె తన దుస్తుల్ని తీసేసి.. ఫోటోలు దిగటం షురూ చేశారు.

ఊహించని పరిణామానికి అక్కడి వారంతా అవాక్కు అయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక వార్డు కౌన్సిలర్ గజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. వారు ఆమె బస చేసిన హోటల్ కు వెళ్లి విచారించారు. తానుతన కంపెనీ కోసం అలా ఫోటోలు దిగినట్లు చెప్పారు. భారతీయ చట్టాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో నగ్నంగా ఉండటం.. ఫోటోలు తీసుకోవటం నేరమన్న విషయం తనకు తెలీదని చెప్పారు.

విదేశీ మహిళకు భారత చట్టాల మీద అవగాహన లేని కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చన్న అభిప్రాయానికి వచ్చిన పోలీసులు ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. రిషీకేష్ లాంటి పుణ్యక్షేత్రంలో విదేశీ యువతి నగ్నంగా ఫోటోలు దిగటం సంచలనంగా మారింది.