నన్ను 139 మంది రేప్ చేయలేదు..!

0

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పాతికేళ్ల యువతి రేప్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలైన దళిత యువతి గత తొమ్మిది సంవత్సరాలుగా తన పై అయిదు వేల సార్లకి పైగా అత్యాచారం జరిగిందని తనని అత్యాచారం చేసిన వారు 139 మంది ఉన్నారని ఆ 139 మందిలో కొద్ది మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారని అని చెప్పిన సంగతి తెలిసిందే. చాలాసార్లు గ్యాంగ్ రేప్ చేశారనీ గర్భం దాల్చితే అబార్షన్ చేయించారని తనను నగ్నంగా ఫొటోలు వీడియోలు తీశారనీ సిగరెట్ల తో వాతలు పెడుతూ… హింసించారని బాధితురాలు తెలిపింది. ఎవరికైనా చెబితే… చంపుతామని గన్ తో బెదిరించారని వివరించింది. అత్యాచారానికి పాల్పడిన వారిలో రాజకీయ నేతల పీఏలు విద్యార్థి సంఘాల నాయకులు టాలీవుడ్ నటులు కూడా ఉన్నారని బాధితురాలు ఆరోపించింది. వాళ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇచ్చింది.

ఆ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు .. 139 మంది పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ లిస్ట్ లో యాంకర్ ప్రదీప్ సినీ నటుడు కృష్ణుడు వంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా బాధితురాలు మాట్లాడుతూ 139 మంది నన్ను రేప్ చేయలేదు అని నా ఫ్యామిలీని చంపేస్తానని డాలర్ భాయ్ బెదిరించాడు అని చెప్పింది. కేసును తప్పుదోవ పట్టించిన ఆ డాలర్ భాయ్ ఒత్తిడి వల్లనే కేసులో యాంకర్ ప్రదీప్ పేరు చెప్పవలసి వచ్చిందని ఆమె వెల్లడించింది. నేను చెప్పిన సెలబ్రిటీలు ఎవ్వరికీ ఈ కేసుతో సంబంధం లేదని చెప్పుకొచ్చింది. కృష్ణుడికి కూడా ఈ కేసుతో ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పడం గమనార్హం. నాపై రేప్ జరిగిన మాట వాస్తవమే గానీ కొందరిని అన్యాయంగా బలి చేశాడని నన్ను కొట్టి అందరి పేర్లు పెట్టించాడని బాధితురాలు తెలిపింది. ఈ కేసుతో సంబంధం లేని వాళ్లందరికీ సారీ చెబుతున్నానని చెప్పింది