యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

లవ్ జిహాద్ ఎలా ఉంటుందో ఆమె లైఫ్ చూస్తే అర్థమవుతుంది

0

ఫోటో చూశారుగా.. అందంగా.. ఆకర్షణీయంగా ఉన్న ఈమె జీవితం గురించి వింటే తల్లడిల్లాల్సిందే. ఇలాంటివి కొన్ని మాత్రమే బయటకు వస్తుంటాయి. రాని ఉదంతాలు చాలానే ఉంటాయి. ప్రేమ ఊబిలోకి దించేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం.. అప్పటి నుంచి నరకం అంటే ఏమిటో చూపించే కొందరు దుర్మార్గులు ఉంటారు.

అలాంటి వారికి బలైన చాలామంది అమాయక మహిళలు బయటకు రాలేక.. తమ బాధలు చెప్పుకోలేక కిందా మీదా పడుతుంటారు. అలాంటి వారిలో కొందరు ధైర్యం చేసి బయటకు వస్తారు. అలాంటి వారి జీవితాల్ని చూసినప్పుడు.. ఇలాంటి విషవలయాల్లోకి జారి పోకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయం బోధ పడుతుంది.

కర్ణాటకకు చెందిన అపూర్వ పురాణిక్ అనే మహిళ.. జీవితంలో ఏదైనా తప్పు చేసిందంటే అది ఆటో ఎక్కటమేనని చెబుతారు. కాలేజీకి వెళ్లే సమయంలో హిజాజ్ అనే వ్యక్తి ఆటోలో ఆమె వెళ్లేది. ఈ క్రమంలో ఆమెను లవ్ ట్రాప్ లో పడేసి.. శారీరకంగా వేధించాడు. బయటకు చెబితే పరువు పోతుందన్న భయంతో మునిగిన ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని.. తనకు అడ్వాంటేజ్ గా మార్చుకున్నాడు.

తనకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు తీసిన తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించాడు. చివరకు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు తెలిసిందేమిటంటే.. హిజాజ్ కు అప్పటికే పెళ్లైందని.. ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసి షాక్ తింది. అప్పటికే ఆమెను పెళ్లి చేసుకొని విజయపురకు తీసుకెళ్లి కాపురం మొదలు పెట్టి.. రాక్షసంగా వ్యవహరించేవాడు. మతం మార్చుకోవాలని.. అప్పుడే కాపురం చేస్తానని బెదిరించేవాడు.

శాఖాహారం మాత్రమే తినే ఆమె చేత బలవంతంగా మాంసాహారం వండాలని.. అతడితో పాటు తినాలంటూ ఒత్తిడి చేశాడు.కొడుకు పుడితే.. అతడికి మాంసం తినిపించేవాడు. అతడి చేతిలో నరకం చవి చూసిన ఆమె.. ఈ నెల పుట్టింటికి వచ్చేసింది. తనతో మాట్లాడాలని బయటకు తీసుకొచ్చి.. ఆమెపై మచ్చుకత్తితో 23సార్లు పొడిచాడు.

తీవ్రగాయాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకు.. తన పిల్లాడికి ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతోంది. ఈమె ఉదంతం విన్నంతనే లవ్ జిహాద్ అన్న మాట అప్రయత్నంగా గుర్తుకు రాక మానదు. కాటేసే కాలనాగులు చుట్టూ ఉన్నాయన్న విషయాన్ని గుర్తించి మరీ అమ్మాయిలు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.