యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Pics.

తెలుగునౌ.కాం 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

హైదారబాద్ లో ఆ డీజిల్ లీటరుకు రూ.19 చొప్పున పెంచేశారు

0

రష్యాకు వార్ యావ పుట్టటం.. పక్కనున్న ఉక్రెయిన్ ను ఇట్టే అక్రమించాలన్న లక్ష్యంతో మొదలైన యుద్ధం.. మూడు వారాలు ముగిసాయి. చూస్తున్నంతనే యుద్దం ప్రారంభమైనప్పటికి.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించటంలేదు. ఈ యుద్ధ ప్రభావంతో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలోపెరగటం తెలిసిందే. దీనికి అనుగుణంగాపెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచుతారన్న మాట వినిపించింది. అందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు అడ్డంకిగా మారినట్లు చెప్పారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటమే కాదు.. అవి బయటకు వచ్చేసి వారానికి దగ్గరగా వచ్చేసింది. అందరిన అంచనాలకు భిన్నంగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని బాదేసేలా మోడీ సర్కారు నిర్ణయం తీసుకుటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

తమ పాలనలో దేశంలోని ప్రతి పౌరుడు వేలెత్తి చూపించే నెగిటివ్ పాయింట్ ఏమైనా ఉందంటే.. అది పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటమేన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వేళ.. తాజాగా పెరిగిన ముడిచమురుకు తగ్గట్లు పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచితే జరిగే నష్టం అంతా ఇంతా కాదన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. కేంద్రం ఒక అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. పెట్రోల్ బంకుల్లో అమ్మే వాటి ధరల్ని ఏ మాత్రం పెంచకుండా.. అందుకు భిన్నంగా బల్క్ డీజిల్ మీద మాత్రం భారీగా ధర పెంచేశారు. దీని కారణంగా సగటు జీవికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. బల్క్ డీజిల్ (అంటే ఒకేసారి భారీగా కొనుగోలు చేసేవారు) కొనే వారి మీద మాత్రమే పెను భారం పడింది.

ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్లుగా బల్క్ డీజిల్ ను లీటరుకు రూ.19 చొప్పున పెంచుతూకేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో.. బల్క్ డీజిల్ కొనుగోలు చేసే వారి మీద పెను దెబ్బ పడే అవకాశం ఉంది. మంగళవారం బల్క్ డీజిల్ లీటరుకు రూ.99 గా ఉంది. బుధవారం రికార్డు స్థాయిలో ఒక్కరోజులో లీటరకు రూ.19 చొప్పున పెంచేశారు. దీంతో బల్క్ డీజిల్ లీటరు ధర ఏకంగా రూ.118కు చేరుకుంది.

యుద్ధం కారణంగా ఇంత భారీగా ధర పెంచటంతో బల్క్ డీజిల్ కొనుగోలు చేసే ఆర్టీసీతో పాటు వివిధ సంస్థల మీద పెను భారంగా మారింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ బస్సులకు వారి డిపోల్లోనే డీజిల్ బంకులు ఉంటాయి. తాజాగా పెరిగిన ధరలతో.. బస్సు డ్రైవర్లను పెట్రోల్ బంకుల్లో పోయించుకోవాలని ఆర్టీసీ చెబుతోంది. ప్రస్తుతానికి బల్క్ డీజిల్ మీద పడిన ధరల బాంబు.. సామాన్యుల మీదా.. బంకుల్లో డీజిల్ కొనుగోలు చేసే వారి మీద ఎప్పుడు పడుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.