Templates by BIGtheme NET
Home >> Telugu News >> కొత్త గండం.. 6 రోజుల్లో దేశంలో అక్షరాల లక్ష కొత్త కేసులు

కొత్త గండం.. 6 రోజుల్లో దేశంలో అక్షరాల లక్ష కొత్త కేసులు


కరోనా అంటే వణికే పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడు.. కంటి ముందు కేసులు పెరుగుతున్నా.. కరోనా ఎక్కడ ఉందండి. దాని ప్రభావం తగ్గిపోయిందండి. కేసులదేముంది.. వచ్చి పోతాయంతే.. అన్నట్లుగా పలువురి తీరు ఇప్పుడు కొత్త కేసులు పెద్ద ఎత్తున నమోదయ్యే పరిస్థితికి తీసుకొస్తోంది. గడిచిన కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసుల నమోదు.. ఇప్పుడు అందుకుభిన్నంగా రోజూ 20వేలకు పైనే కేసులు నమోదవుతున్న వైనం కొత్త టెన్షన్ గా మారింది.

గడిచిన ఆరు రోజుల్లో దేశ వ్యాప్తంగా లక్ష కొత్త కేసులు నమోదు కావటం.. క్యాలెండర్ లో రోజు గడిచే కొద్దీ కేసులు నమోదు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. దీంతో..కొన్నిచోట్ల పాక్షికంగా లాక్ డౌన్ విధిస్తే.. మరికొన్ని చోట్ల మరోసారి ఆంక్షల్ని విధించేందుకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం కొన్ని రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

గడిచిన 78 రోజుల్లో నమోదు కాని ఎక్కువ కేసులు తాజాగా నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఒక్కరోజులోనే 23285 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 117 మంది ఒక్కరోజులో మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో సగానికి పైనే మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. గురువారం ఒక్కరోజులో మహారాష్ట్రలో 15817 కేసులు నమోదు కావటం చూస్తే.. బారత్ లో నమోదయ్యే కేసుల్లో సింహభాగం మహారాష్ట్ర పుణ్యమేనని చెప్పాలి.

మహారాష్ట్రలో ఇంతలా కేసులు పెరగటానికి కారణం.. జనవరిలో జరిగిన పంచాయితీ ఎన్నికలే అని చెబుతున్నారు. ఎన్నికల అనంతరం నిర్వహించిన విజయోత్సవ వేడుకలు.. తాజా దుస్థితికి కారణంగా చెబుతున్నారు. దీనికి తోడుకరోనా నిబంధనల్ని ఆ రాష్ట్ర ప్రజలు పెద్దగా పట్టించుకోవటంలేదంటున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన వారంతా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.