జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి అమెరికా భారీ పరిహారం.. ఎన్ని కోట్లంటే ?

0

జార్జ్ ఫ్లాయిడ్ … ఈ పేరుని అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. గత ఏడాది అగ్రరాజ్యం అమెరికాలోని మిన్నియాపోలిస్ లో గతేడాది శ్వేతజాతి పోలీస్ అధికారి చేతిలో మరణించిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్. జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి రూ.196 కోట్లు నష్ట పరిహారంగా చెల్లించనున్నట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని మిన్నెసొటా నగర అడ్వకేట్లు ఫ్లాయిడ్ కుటుంబానికి తెలిపారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద ప్రీ ట్రయల్ సెటిల్ మెంట్ అని అడ్వకేట్లు వెల్లడించారు.

గతేడాది మే 25న జార్జ్ ప్లాయిడ్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో శ్వేతజాతి పోలీసు డెరెక్ చౌవిన్ అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. సాధారణ నిందితుడి పట్ల వ్యవహరించాల్సిన విధంగా కాకుండా ఓ తీవ్రవాది పట్ల వ్యవహరించే తీరుగా ప్రవర్తించడం పలు విమర్శలకు దారితీసింది. అతన్ని కిందపడేసి మెడపై తన కాలితో చాలాసేపు నొక్కొపట్టడం మూలంగా ఊపిరి ఆడక ప్రాణాలు విడిచాడు. ఊపిరి ఆడడం లేదని ఫ్లాయిడ్ అరిచినా కనికరం లేకుండ ప్రవర్తించడు. అక్కడున్నవారు కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లడైయ్యాయి. ఈ ఘటనపై ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు గత ఏడాది జూలైలో మిన్నెసొటా కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో మిన్నియా పోలీసులు కోర్టు బయట పరిష్కరించుకుందామని చెప్పి ఫ్లాయిడ్ కుటుంబాన్ని ఒప్పించింది. ఇరు వర్గాల అంగీకారం మేరకు రూ.196 కోట్లు నష్ట పరిహారం చెల్లించనున్నారు.

ఈ విషయాన్ని మిన్నెసోటా నగర లాయర్లు శుక్రవారం ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అన్యాయంగా ఫ్లాయిడ్ ను పోలీసులు చంపేశారని ఇది వారికి తగిన గుణపాఠం అని ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ప్రీ-ట్రయల్ సెటిల్మెంట్ అని న్యాయవాదులు తెలిపారు. ఈ పరిహారం చెల్లింపు తరువాత నల్లజాతీయులపై శ్వేతజాతీయులు దౌర్జన్యానికి దిగాలంటే ఆలోచించాల్సి ఉంటుందని ఫ్లాయిడ్ సోదరుడు రోడ్నీ తెలిపారు.