యంగ్ టైగర్ అభిమానులకు శుభవార్త..!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ప్రారంభిస్తారనేది తాజా సమాచారం.

అలాగే ఈ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటించనుందని .. అల వైకుంఠపురములో తర్వాత థమన్ మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పని చేయనున్నారని తెలుస్తోంది. 2022 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ప్రస్తుతం తారక్ ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణను పూర్తి చేసి తదుపరి త్రివిక్రమ్ తో సెట్స్ కెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

అరవింద సమేత తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతోందో చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఆలోచనను ఇంకా టీమ్ విరమించుకోలేదు. చిత్రీకరణ ప్రారంభమై.. శరవేగంగా అనుకున్నట్టు అన్నీ పూర్తయితే సంక్రాంతికే వచ్చే వీలుంటుంది. అయితే సంక్రాంతి బరిలో పవన్ .. మహేష్ వంటి టాప్ స్టార్లు పోటీబరిలో ఉన్న సంగతి తెలిసిందే.