సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రీలుక్ హీట్

0

క్రీడా బయోపిక్ లకు అన్నివేళలా ఆదరణ ఉంది. అందుకే ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగదు. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పైనా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పరిణీతి చోప్రా టైటిల్ పాత్రను పోషిస్తోంది. తాజాగా ప్రీ-లుక్ పోస్టర్ తాజాగా ఆవిష్కరించారు. తదుపరి ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది.

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత ప్రయాణం ఆధారంగా `సైనా` టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక సాధారణ యువతి ఒలింపిక్ పతక విజేతగా ఎలా నిలిచింది.. ఈ ప్రయాణంలో సవాళ్లు ఏమిటి..? కష్టనష్టాలేమిటన్నది తెరపై చూపించనున్నారు.

పరిణీతి చోప్రా సైనా పాత్రలో ఎలా ఉండనుంది? అన్నది ఇప్పటికే తెలుగు అభిమానుల్లో క్యూరియాసిటీ ఎంచుతోంది. ప్రీ-లుక్ పోస్టర్ లో షటిల్ కాక్ ని గాల్లోకి విసిరే చేయిని మాత్రమే చూపించారు. ట్రై-కలర్ రిస్ట్ బ్యాండ్ తో క్రీడాకారిణి అన్న మీనింగ్ ని తెచ్చారు. అమోల్ గుప్తా ఈ చిత్రానికి దర్శకరచయిత. ఈ చిత్రంలో సైనా జీవితంలో కొన్ని సంఘటనలు ..ఉద్విగ్న క్షణాలు తెరపై రక్తి కట్టించనున్నాయని చెబుతున్నారు. ప్రీ-లుక్ పోస్టర్ తో పాటు మేకర్స్ విడుదల తేదీని కూడా మార్చి 26 అంటూ ప్రకటించారు. త్వరలోనే ఫస్ట్ లుక్ ట్రైలర్ రిలీజ్ కానున్నాయి.