Home / Telugu News / GHMC Election Results Live Updates

GHMC Election Results Live Updates

గ్రేటర్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్నిగంటల్లోనే గ్రేటర్ పీఠం ఎవరిది అన్న విషయం తేలిపోనుంది. ఉదయం 8 గంటల నుంచి గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 150 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఒక్కో హాల్‌లో 14 కౌంటింగ్ టేబుల్స్ సిద్ధం చేసింది. ఒక్కో రౌండ్‌కి 14,000 ఓట్లను లెక్కిస్తారు. మూడు రౌండ్లలోనే పూర్తి ఫలితం వెలువడనుంది. కౌంటింగ్‌లో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 2,629 పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేశారు.

అయితే వాటిలో ఉదయం 8 గంటలలోపు కౌంటింగ్ సెంటర్‌కు వచ్చే పోస్టల్‌ బ్యాలెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. 11 గంటల తర్వాత తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1,926 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అభ్యర్థి లేదా అభ్యర్థి తరపున ఎలక్షన్ ఏజెంట్, అడిషనల్ కౌంటింగ్ ఏజెంట్‌నే కౌంటింగ్ టేబుల్ దగ్గరకు అనుమతించనున్నారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు.ఓల్డ్ మలక్ పేట డివిజన్‌లో సీపీఐ పార్టీ గుర్తు తారుమారు కావడంతో అక్కడ డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహించారు. గ్రేటర్‌లోని 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 74,67,256 ఓట్లు ఉండగా 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

GHMC Election Results Live Updates

GHMC Election Results, GHMC Election Results Live Updates, GHMC Election Results 2020, 2020 GHMC Election Results, GHMC 2020 Election Results, GHMC Election Results LIVE TV9, GHMC Election Results LIVE etv telangana, GHMC Election Results LIVE 10TV, GHMC Election Results LIVE ABN Andhra Jyothi, GHMC Election Results LIVE TV6, GHMC Election Results LIVE Online, greater hyderabad municipal elections election 2020 results

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top