Templates by BIGtheme NET
Home >> Telugu News >> అయోధ్యలో భారీ గంట..కొడితే ‘ఓం శబ్దం’ కిలోమీటర్ వినిపిస్తుందట!

అయోధ్యలో భారీ గంట..కొడితే ‘ఓం శబ్దం’ కిలోమీటర్ వినిపిస్తుందట!


అయోధ్యలో నిర్మితమౌతున్న రామమందిరానికి అప్పుడే ఓ భారీ కంచు గంట వచ్చి చేరింది. రామేశ్వరానికి చెందిన భక్తురాలు లీగల్ రైట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి మండా రాజ్యలక్ష్మి రామేశ్వరం నుంచి 4500 కీమీ ప్రయాణించి ట్రస్టు సభ్యులకు అందజేశారు. రాజ్యలక్ష్మి ఈ గంటను తయారు చేశారు. 613 కిలోల బరువుతో తయారుచేసిన ఈ భారీ గంటలో ఓ అరుదైన ప్రత్యేకత ఉంది.

సాధరణంగా ఏ ఆలయంలో కానీ ఇళ్లల్లో కానీ ఏ గంటనైనా కొడితే టంగ్ టంగ్ అని మోగుతుంది. కానీ ఈ భారీ గంటను కొడితే మాత్రం చుట్టుపక్కల కిలోమీటర్ వరకు ‘ఓం’ అనే శబ్ధం వస్తోంది. దీంతో భక్తులు ఎంతో ఆసక్తిగా దాన్ని మోగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. 4.13 అడుగుల పొడవు 3.9 అడుగుల వెడల్పుతో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేశారు. జై శ్రీరాం అనే అక్షరాలు రాసి ఉంచారు.

ప్రధాని మోదీ పుట్టిన రోజు సెప్టెంబరు 17న ప్రత్యేక వాహనంలో బయలుదేరిన ఈ గంట బుధవారం చేరుకుంది. దీనికి ప్రత్యేక పూజలు చేసి పంపించారు. రామాయణంలో రామేశ్వరానికి ప్రత్యేక స్థానం ఉంది. సీతాదేవి కోసం ఇక్కడి నుంచి శ్రీలంకకు వానరసేనతో కలిసి శ్రీరాముడు సముద్రంలో వారధిని నిర్మించారు. అందుకే ఇక్కడి నుంచి భారీ గంటను తయారు చేసి పంపించారు.