భారత్ పై మరో మహమ్మారి దాడి…బీ అలర్ట్

0

కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ తో పాటు చాలా ప్రపంచ దేశాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. మొదట జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని ప్రచారం జరగడంతో కరోనా చాలా దేశాలను కకావికలం చేసింది. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుందని తెలుసుకునేసరికి నష్టం జరిగింది. ఇంకా కరోనా బారినుంచి ప్రపంచ దేశాలు కోలుకోక కొద్ది రోజుల క్రితం చైనాలో బ్రూసెల్లోసిస్ అనే మరో మహమ్మారి విజృంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ లోనూ ఈ వ్యాధి ప్రబలే అవకాశాలున్నాయని అప్రమత్తంగా లేకుంటే ఇది కరోనా తరహాలోనే మరో పెను విపత్తుకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రూసెల్లోసిస్ను ‘మాల్టా ఫీవర్’ ‘మెడిటెర్రేనియన్ ఫీవర్’ అని కూడా పిలుస్తారు. జ్వరం తలనొప్పి కడుపు నొప్పి కీళ్లు కండరాల నొప్పి వెన్ను నొప్పిచలి చెమటలు పట్టడం ఆయాసం అలసట ఆకలిగా లేకపోవడం బరువు తగ్గడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. దీని బారిన పడ్డవారు కోలుకునేందుకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టవచ్చు. కరోనామాదిరిగానే కొన్ని రకాల యాంటీ బయాటిక్స్తో ఈ వ్యాధిని నయం అవుతుంది. చైనాలోని ఓ ఫార్మాస్యుటికల్ కంపెనీలో పురుడుపోసుకున్న ఈ వ్యాధి… ల్యాన్ఝౌ నగరంలో 3వేల మందికి సోకింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రధానంగా ఈ బ్రూసెల్లో అనే బ్యాక్టీరియా వల్ల బ్రూసెల్లోసిస్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.మనిషి నుంచి మనిషికి ఈ బ్యాక్టీరియా సోకినట్లు ఆనవాళ్లు లేవని సీడీసీ తెలిపింది.

పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుంది. పాడిపంటలకు నెలవైన భారత్ లో పశువుల ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆవులు గేదెలు పందుల ద్వారా ఈ వ్యాధి మనుషఉలకు సోకుతుందని చెబుతున్నారు. సరిహద్దు దేశమైన చైనా నుంచి ఈ వ్యాధి పొరుగుదేశాలకు జంతువుల ద్వారా మనుషుల ద్వారా సోకే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవారితోపాటు స్వదేశంలోని వారిపై కరోనా టెస్టులతోపాటు బ్రూసెల్లోసిస్ నిర్ధారణ పరీక్షలూ చేయాలంటున్నారు. అయితే భారత్ లో గతంలోనూ బ్రూసెల్లోసిస్ కేసులు వచ్చాయని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మాదిరిగా ఇది మరో మహమ్మారిలా మారకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.