Templates by BIGtheme NET
Home >> Telugu News >> అమరావతిలో రాజధాని వద్దు: మంత్రి నాని

అమరావతిలో రాజధాని వద్దు: మంత్రి నాని


ఏపీకి మూడు రాజధానులు చేయాలని సీఎం జగన్ నిర్ణయించి ఆ దిశగా ముందుకెళ్తున్నారు. కానీ ఇది కోర్టుల చిక్కు ముడుల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలోనే మరో సంచలన ప్రతిపాదన చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. పేద ప్రజలు ఉండేందుకు వీల్లేని అమరావతి లో శాసన రాజధాని కూడా ఉండేందుకు వీల్లేదని సీఎం జగన్ ను కలిసి చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

తన ప్రతిపాదనకు అన్ని పక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారని మంత్రి నాని సోమవారం సంచనల ప్రకటన చేశారు. దీంతో అమరావతిలో అసలు శాసన రాజధాని కూడా లేకుండా చేయాలని ఏపీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే అమరావతి లో 55వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కోర్టు కు వెళ్లి స్టే తీసుకు రావడంపై మంత్రి నాని విమర్శించారు. ఉచిత విద్యుత్ సంస్కరణలు చేసి రూ.30వేల కోట్లతో ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని.. దీని ఏ రైతు వ్యతిరేకించకున్నా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మంత్రి మండి పడ్డారు.

చంద్రబాబుకు బలం లేదని.. లోకేష్ ను ఎమ్మెల్యే చేయడం ఎవరి వల్లా కాదని మంత్రి నాని విమర్శించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే ఉంటానని తెలిపారు.

అమరావతి చుట్టే ఏపీ రాజధాని మార్పు ఆగుతోంది. ఈ క్రమంలోనే అసలు రాజధానిగా అమరావతినే లేకుండా చేస్తే ఎలా ఉంటుందని.. ఆ క్రమంలోనే ఆ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేల ద్వారానే ఈ వాణి వినిపించేలా వైసీపీ వ్యూహాత్మకంగా కదులుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.