కొరియన్ రీమేక్ కోసం యాక్షన్ స్పెషలిస్ట్

0

కొరియన్ సినిమా `మిస్ గ్రానీ` తెలుగులో `ఓ బేబీ `పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. కొరియన్ కాన్సెప్ట్ ను తెలుగు ప్రేక్షకులు అనూహ్యంగా ఆదరించడంతో నిర్మాత సురేష్ బాబు మరో రెండు కొరియన్ మూవీస్ రీమేక్ లని తెరపైకి తీసుకురాబోయే ప్రయత్నాల్లో వున్నారు. సురేష్ బాబు సొంతం చేసుకున్న కొరియన్ మూవీస్ మిడ్ నైట్ రన్నర్స్.. డ్యాన్సింగ్ క్వీన్.

ఈ రెండు చిత్రాల్లో `మిడ్ నైట్ రన్నర్స్` చిత్రాన్ని సుధీర్ వర్మ రీమేక్ చేయబోతున్నారు. ఇందులోని కీలక పాత్రల్లో రెజీనా- నివేదా థామస్ నటించబోతున్నారు. ఇదిలా వుంటే `డ్యాన్సింగ్ క్వీన్` చిత్రం కోసం యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీవాస్ ని సంప్రదించారట. లౌక్యం- సౌఖ్యం- డిక్టేటర్- సాక్ష్యం వంటి యాక్షన్ చిత్రాల్ని రూపొందించిన శ్రీవాస్ ని సురేష్ బాబు `డ్యాన్సింగ్ క్వీన్` రీమేక్ కి ఎంచుకోవడం కొంత ఆశ్చర్యంగా వుంది.

`డ్యాన్సింగ్ క్వీన్` ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఇలాంటి చిత్రాన్ని యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీవాస్ ఎలా హ్యాండిల్ చేస్తాడన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి సహనిర్మాతగా సునీత తాటి వ్యవహరించనున్నారు. కాస్టింగ్ తదితర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.