రియా బాలీవుడ్ మొత్తాన్ని ఇరికించేసింది

0

నేనే పోవాల్సి వస్తే ఒంటిరిగా మాత్రం పోను తోడుగా వందమందికి తీసుకెళ్తా అన్నాడట వెనకటి ఒకడు.. బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో ఇరుక్కున్న రియా చక్రవర్తి వ్యవహారం కూడా అలాగే వుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రియాకు డ్రగ్స్ డీలర్ లతోనూ సంబంధాలు వున్నట్టు బయటపడటంతో ఈ కేసుని మాదక ద్రవ్యాల కోణంలోనూ విచారిస్తున్నారు. ఇప్పటికే రియా సోదరుడిని అదుపులోకి తీసుకున్న ఎన్.సీబీ తాజాగా రియాని కూడా విచారించింది.

అయితే ఈ రోజు విచారణలో రియా పలు సంచలన అంశాల్ని వెల్లడించినట్టు సమాచారం. షోవిక్ చక్రవర్తి.. శామ్యూల్ మిరండా.. దీపేష్ సావంత్ లను ఇప్పటికే విచారించిన ఎన్.సీబీ తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాని కూడా విచారించింది. సోమవారం ఆమె కీలక విషయాల్ని బయటపెట్టినట్టు చెబుతున్నారు. డ్రగ్స్ తన సోదరుడు షోవిక్ ద్వారా తీసుకున్నానని డ్రగ్ డీలర్ బాసిత్ తనకు ఐదు సార్లు కలిశాడని తనే ఇంటికి వచ్చేవాడని అయితే తనకు ఎలాంటి డ్రగ్ అలవాటు లేదని స్పష్టం చేసిందట.

షాకింగ్ విషయం ఏంటంటే ఈ సందర్భంగా రియా ఎన్.సీబీ అధికారులకు డ్రగ్ అలవాటున్న 18 మంది బాలీవుడ్ స్టార్ల పేర్లని బయటపెట్టినట్టు చెబుతున్నారు. అయితే ఆ స్టార్లెవరన్నది మాత్రం ఆసక్తిరంగా మారింది. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ వర్గాలు మాత్రం బాలీవుడ్ ని మొత్తానికి రియా ఇరికించేసిందని ఈ దెబ్బతో బాలీవుడ్ ప్రక్షాళన జరగడం ఖాయమని చెబుతున్నారు.