యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

పవన్ కళ్యాణ్ విమర్శలకు మోహన్ బాబు గట్టి కౌంటర్

0

సాయిధరమ్ హీరో నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సంచలనమయ్యాయి. ఏపీ ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీని షేక్ చేసేలా వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలోనే నటుడు మోహన్ బాబు, అన్నయ్య చిరంజీవి తీరును ఎండగట్టారు.

ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ సినీ పరిశ్రమ టికెట్లను ఆన్ లైన్ లో విక్రయిస్తూ నష్టం చేస్తోందని.. జగన్ కు దగ్గరి బంధువైన మోహన్ బాబు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇలానే మౌనంగా ఉంటే నీ ‘విద్యానికేతన్’ విద్యాసంస్థకు ఎసరు వస్తుందని నిలదీశారు.

ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు సీనియర్ నటుడు మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు. ‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించాను. వవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమిలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్, సంతోషమే.ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను.ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని… నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్ కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను.’’ అని మోహన్ బాబు కౌంటర్ కు రెడీగా ఉండాలని పవన్ కళ్యాణ్ కు సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చారు.

దీన్నిబట్టి అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు అయిపోగానే మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తాడని తెలుస్తోంది.