Templates by BIGtheme NET
Home >> Telugu News >> అక్కడ బీజేపీకి పవన్ ఎదురెళ్ళి షాక్ ఇస్తారా…?

అక్కడ బీజేపీకి పవన్ ఎదురెళ్ళి షాక్ ఇస్తారా…?


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాషాయం పార్టీకి సరైన చోట హ్యాండ్ ఇచ్చేలా పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. బీజేపీకి సౌతిండియాలో కర్నాటక తరువాత ఏ మాదిరి ఆశలు ఉన్నది తెలంగాణాలోనే. అక్కడ ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా ఎన్నో కొన్ని సీట్లు సొంతంగా వస్తాయి. ఇక అధికారంలోకి వచ్చేస్తామని బీజేపీ అంటోంది కానీ ఎసారికి బలం పెంచుకోవడం మీదనే ఫోకస్ ఉందని అంటున్నారు.

బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ లో బలం ఉంది అలాగే కొన్ని జిల్లాల్లో పట్టు ఉంది. ఓవరాల్ గా తెలంగాణా అంతటా బీజేపీ పెర్ ఫార్మెన్స్ 2018 నాటికి ఇప్పటికి ఏమైనా పెరిగిందా అంటే డిసెంబర్ 3న రిజల్ట్ ని బట్టి చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణాలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఏపీలో జనసేనతో మిత్ర బంధం ఉంది. కానీ తెలంగాణా ఉప ఎన్నికల్లో కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ జనసేన సాయం తీసుకోలేదు.

మరో వైపు చూస్తే ఏపీలో కూడా రాజకీహ్యం మారుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు. బీజేపీ కూడా తమ కూటమితో కలసి వస్తుందని ఆయన ఎంత చెప్పినా ఆ దిశగా అయితే ఇంకా కాషాయం పార్టీ ఏమీ ఆలోచించుకోలేదు. తెలంగాణా ఎన్నికలు అయిన తరువాత ఏపీ మీద దృష్టి పెడతారు అనుకుంటే ఈలోగానే తెలంగాణాలో బీజేపీకి జనసేన టీడీపీ కూటమి ఎదురు నిలిచేలా సీన్ ఉందని అంటున్నారు.

తెలంగాణా ఎన్నికల్లో జనసేనతో తమ పార్టీ కలసి ముందుకు సాగుతుందని తెలంగాణా టీడీపీ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీతో పొత్తు ఉందని అది తెలంగాణాలో కూడా విస్తరిస్తుందని ఆయన చెప్పిన విషయం గమనార్హం. అంతే కాదు తాను ఒకటి రెండు రోజులలో రాజమండ్రి జైలుకు వెళ్ళి చంద్రబాబుని ములాఖత్ లో కలుసుకుని ఈ పొత్తుల మీద చర్చిస్తాను అంటున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో ఈ విషయం మీద మాట్లాడుతాను అని ఆయన అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే తెలంగాణాలో జనేఅన 32 సీట్లకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది. అందులో టీడీపీకి బలం ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయని తెలుసోంది. పొత్తులు కనుక కుదిరితే జనసేన సీట్లను తగ్గించుకుని అందులో టీడీపీకి కావాల్సిన సీట్లు ఇచ్చి సర్దుబటు చేస్తుందని అంటున్నరు. ఒక సెటిలర్స్ మీద ఆంధ్రా జనాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి టీడీపీ జనసేన పోటీకి దిగుతాయని అంటున్నారు.

ఇదే గ్రేటర్ హైదరాబాద్ లో ఇవే ఓట్ల మీద బీజేపీ కూడా కన్నేసి పోటీ చేస్తోంది. ఓట్లు చీలుతాయనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేనను పోటీ నుంచి తప్పుకోమని బీజేపీ కోరింది. ఇపుడు అయితే అలాంటి పరిస్థితి లేకపోగా టీడీపీతో జనసేన కలసి ముందుకు వస్తే అది బీజేపీకి పెద్ద దెబ్బ అంటున్నారు.

తమకు మిత్రుడు అనుకున్న పవన్ కళ్యాణ్ తమకు ఆశలు ఉన్న తెలంగాణాలో ఎదురొస్తారా అన్నదే ఇపుడు కమలం పార్టీలో చర్చగా ఉంది. పోనీ బీజేపీ టీడీపీ జనసేనలతో కలవాలని భావిస్తే ఆంధ్రా పార్టీలతో పొత్తు అని అంటారు. అలా తెలంగాణా సెంటిమెంట్ ని బీయారెస్ రాజేస్తుంది. ఇక టీడీపీతో పొత్తుకు బీజేపీ స్వతహాగా ఇష్టం లేదు అంటున్నారు.

ఇలాంటి పరిణామాల నేపధ్యంలో నిజంగా జనసేన టీడీపీ కలసి పోటీ చేస్తే మాత్రం అది బీజేపీకి గట్టి దెబ్బగానే భావిస్తున్నారు. మరి పవన్ ఏపీలో మిత్రుడిగా ఉంటూ తెలంగాణాలో బీజేపీకి ఎదురొస్తారా అంటే రాజకీయం అంటే ఇదే అని అంటున్న వారూ ఉన్నారు. అయితే ఆ విధంగా జరిగితే మాత్రం బీజేపీ ఏపీలో కూడా సంచలన నిర్ణయం తీసుకుంటుందని అది టీడీపీ జనసేన కూటమికి షాక్ ఇచ్చేలా ఉంటుందని కూడా అంటున్నారు.