Templates by BIGtheme NET
Home >> Telugu News >> టీటీడీపై రమణ దీక్షితులు మరోసారి..

టీటీడీపై రమణ దీక్షితులు మరోసారి..


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వార్తల్లోకి వచ్చారు. కొంత కాలంగా టీటీడీ మీద జగన్ సర్కారు మీద విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. మరోసారి ట్విట్టర్ వేదికగా టీటీడీ తీరును తప్పుబట్టారు. శ్రీవారి ఆలయ అర్చకులకు రక్షణ కల్పించడంలో టీటీడీ విఫలమైందని ఆయన ఆరోపించారు. గతంలో తనకు వారసత్వంగా వచ్చిన శ్రీవారి అర్చకత్వం కొనసాగేలా చూడాలని పోరాడి ఓడిపోయి బలవంతంగా పదవీ విరమణ చేసిన టీటీడీ సీనియర్ అర్చకుడితో పాటు ఇటీవల కరోనా వల్ల చనిపోయిన 45 ఏళ్ల అర్చకుడి కుటుంబాలను ఆదుకొవాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలను ట్యాగ్ చేస్తూ అర్చకుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీ నుంచి తప్పించబడ్డ రమణ దీక్షితులు.. జగన్ సర్కారు అధికారంలోకి రాగానే తిరిగి తన పదవిని దక్కించుకున్నారు. దీంతో ఆయన ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతారని అంతా అనుకున్నారు. కానీ కొన్ని నెలలుగా ఆయన టీటీడీ మీద జగన్ సర్కారు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. భూముల విక్రయానికి జీవో ఇవ్వడం సహా వివిధ అంశాల్లో టీటీడీ తీరును దుయ్యబట్టారు.