ఏపీలో ఎంసెట్ సహా సెట్ పరీక్షల తేదీలు ఖరారు!

0

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ కరోనా వైరస్ దెబ్బకు దేశంలో చాలా పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక ఏపీలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. తాజాగా ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు తేదీలు ఖరారు చేశారు. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 10 నుంచి ఈ సెట్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎంసెట్ ఎడ్ సెట్ లాసెట్ సహా పలు పరీక్షలు ఉన్నాయి.

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం ముందుగ ఐసెట్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇ‍క సెప్టెంబర్ 1011 తేదీల్లో ఐసెట్ 14న ఈసెట్ అక్టోబర్ 1న ఎడ్ సెట్ 2వ తేదీన లాసెట్ నిర్వహించనున్నారు. పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పీజీసెట్ కోసం సెప్టెంబర్ 2829 30 తేదీలను ఖరారు చేశారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఐదో తేదీ వరకూ ఏపీపీఈసెట్ నిర్వహిస్తారు. మరోవైపు.. తెలంగాణలో వచ్చే నెల 9 10 11 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించనున్నారు.