Templates by BIGtheme NET
Home >> Telugu News >> 2 గంటల్లో రిజల్ట్ వచ్చేలా రిలయన్స్ కిట్ వచ్చేసింది

2 గంటల్లో రిజల్ట్ వచ్చేలా రిలయన్స్ కిట్ వచ్చేసింది


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కిట్ కు సంబంధించి ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలకు చెక్ చెప్పే ఫీచర్లతో వచ్చేసింది రిలయన్స్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన సరికొత్త ఆర్ టీ-పీసీఆర్ టెస్టు కిట్. సాధారణంగా 24 నుంచి 48 గంటల్లో ఫలితం వచ్చే తీరుకు భిన్నంగా కేవలం రెండు గంటల వ్యవధిలో పక్కా ఫలితం వచ్చేలా దీన్ని రూపొందించినట్లుగా చెబుతున్నారు. కోవిడ్ 19ను కన్ఫర్మ్ చేయటానికి అందుబాటులో ఉన్న టెస్టుల్లో తాము తయారు చేసిన కిట్టే.. అత్యంత విశ్వసనీయ విధానమని రిలయన్స్ చెబుతోంది.

రివర్స్ ట్రాన్ష్ క్రిప్షన్ – పాలిమరైజ్ చైన్ రియాక్షన్ విధానంలో ఇప్పటికే పలు కిట్లు అందుబాటులో ఉన్నాయి. కాకుంటే.. ఆ కిట్లతో ఫలితాన్ని తేల్చాలంటే 24 గంటల సమయం తీసుకుంటోంది. ఇందుకు భిన్నంగా కేవలం 2 గంటల వ్యవధిలోనే రిజల్ట్ వచ్చేయటం దీని ప్రత్యేకత. ఆర్టీపీసీఆర్ తో జరుగుతున్న ఆలస్యంతో మరింత వేగంగా ఫలితం తెలుసుకునేందుకు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు వివిధ రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి.

ర్యాపిడ్ యాంటిజెన్ తో పోలిస్తే.. ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితం మెరుగైనది.. విశ్వసనీయమైనది. ఈ కారణంతోనే ర్యాపిడ్ లో నెగిటివ్ వచ్చిన వారికి.. మరింత స్పష్టత కోసం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయటం తెలిసిందే. యాంటిజెన్ టెస్టుల విధానంలో అరగంటలోనే ఫలితం వచ్చేస్తుంది. కాకుంటే.. ఫలితంపై పలు సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కు ఏ మాత్రం తేడా లేకుండా.. తమ కిట్ ను తయారు చేసినట్లు రిలయన్స్ చెబుతోంది. అయితే.. ఈ కిట్ ను ఆమోదించారా? రిజెక్టు చేశారా? దీన్ని ఉపయోగించటానికి ఓకే చెప్పారా? అన్న విషయంపై మాత్రం ఐసీఎంఆర్ క్లారిటీ ఇవ్వకపోవటం గమనార్హం.