Templates by BIGtheme NET
Home >> Telugu News >> దేశంలో ఎక్కువ కేసులు ఏపీ పోలీసులపైనే..

దేశంలో ఎక్కువ కేసులు ఏపీ పోలీసులపైనే..


అందరిపై కేసులు పెట్టే పోలీసులపైనే కేసులు నమోదయ్యాయని తెలుసా? ఏపీ పోలీసులపై కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరుతెన్నులపై జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పోలీసులపై గత ఏడాది భారీగా కేసులు నమోదయ్యాయి.

భారతదేశంలోని 29 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసులపై నమోదైన కేసులన్నీ కలిపితే 4068. ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 1681 కేసులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.

ఏపీ రాష్ట్ర పోలీసులపై నమోదైన 1681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎన్.సీ.ఆర్.బీకి పోలీసు శాఖ వివరాలు తెలిపింది.

రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్రలో పోలీసులపై 403 కేసులు నమోదు కాగా.. ఆ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. అసోం 397 కేసులతో మూడో స్థానంలో ఉంది. పోలీసులపై కేసులు తప్పనిసరిగానే నమోదు చేస్తారు.

ఏపీలో 1600 మందికి పైగా పోలీసులపై కేసులు ఉన్నా ఎనిమిది కేసుల్లోనే విచారణ పూర్తయ్యింది. అన్ని కేసుల్లోనూ నేరారోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు నిర్ధోషులుగా బయటపడ్డారు. కోర్టులు ఎనిమిది కేసుల్ని క్వాష్ చేశాయి. ఏడు కేసుల్ని ప్రభుత్వం విత్ డ్రా చేసుకుంది.