శ్రీశైలం పేలుళ్లు కేసీఆర్ కుట్రే: రేవంత్ రెడ్డి

0

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రంలోపల 9మంది చిక్కుకొని ఉండడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. శ్రీశైలం పేలుళ్లు ప్రమాదమా? కుట్ర అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై చర్చ మొదలైంది.

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదంపై రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నిజంగా ప్రమాదం జరిగిందా? లేదంటే కుట్ర జరిగిందా అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ కి.. సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. జగన్ జలదోపిడీకి కేసీఆర్ హెల్ప్ చేస్తున్నారని.. అందుకే ఈ ప్రమాదం జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదాన్ని బట్టి చూస్తే విద్యుత్ ప్రాజెక్టులను చంపే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పి ఉంచే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదంపై నిజనిజాలు తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. అప్పుడు జరిగింది ప్రమాదమో.. కుట్ర తెలుస్తోందని ఆరోపించారు. కాగా రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సర్కార్ ఇంతవరకు స్పందించలేదు.