తారక్ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసాడా…?

0

కంటికి కనిపించని మహమ్మారి వల్ల చిత్ర పరిశ్రమ ఎంతటి అవస్థలు పడుతుందో చూస్తేనే ఉన్నాం. ఐదు నెలల నుండి సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి. ఇక విడుదలకు సిద్ధంగా సినిమాలన్నీ వాయిదా పడటంతో ప్రొడ్యూసర్స్ నష్టాలను చవిచుస్తునారు. అందులోనూ ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు.. అగ్రిమెంట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కి సంబంధించిన హీరోలకు నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉండటంతో.. పెట్టుబడి ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి ఉంది. షూటింగ్స్ స్టార్ట్ అయితే ప్రొడ్యూసర్స్ కి మేలు జరుగుతుంది అనుకుంటే.. రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతోంది. దీంతో షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పుడు నిర్మాతలను ఆదుకోడానికి స్టార్ హీరో హీరోయిన్స్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి ముందుకొస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీలో చాలామంది పారితోషకాన్ని తగ్గించుకుంటున్నట్లు స్వచ్ఛదంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తాను తీసుకున్న అడ్వాన్స్ ని వెనక్కి ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ మూవీని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ (చిన్నబాబు) – కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా మహమ్మారి వచ్చి అన్ని తారుమారు చేసింది. దీంతో తారక్ ఇప్పుడు నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకొని తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. కాగా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయల మేర నష్టపోయిన చిత్ర నిర్మాతలు భవిష్యత్ లో అప్పుల్లో కూరుకుపోయే అవకాశాలున్నాయని.. క్రైసిస్ పరిస్థితుల్లో అందరూ తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే అంతో ఇంతో నిర్మాతలు బయటపడే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు.