జాంబీ రెడ్డికి చిరంజీవికి ఏంటి రిలేషన్?

0

వెరైటీ జోనర్లతో తెలుగు ప్రేక్షకులకు ట్రీటిచ్చేందుకు నవతరం దర్శకులు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇటీవల ప్రయోగాలు మరింతగా ముదిరాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏకంగా జాంబీ సినిమాకే శ్రీకారం చుట్టారు. `జోంబీ రెడ్డి`తో జనం ముందు రాబోతున్నాడు. ఇది అలాంటిలాంటిది కాదు.. కరోనా జాంబీ. ఇది జాంబీస్ అలానే కరోనాపై మొదటి తెలుగు చిత్రం. ఇటీవలే టైటిల్ లుక్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22 న మెగాస్టార్ స్పెషల్ డే సందర్భంగా జాంబీ రెడ్డి ఇచ్చిన తాజా గిఫ్ట్ అదిరింది.

జాంబీల్లో రెడ్డి గారి వీపు వెనక మెగాస్టార్ చిరంజీవి ఫోటో కనిపిస్తోంది. ఈ ఫోటోలో చిరు కష్మోరా రూపం షాకిస్తోంది. మెగాస్టార్ క్లాసిక్ సూపర్ హిట్ సాంగ్ కష్మోరా కౌగిలిస్తే.. కు ఈ తరహా బీజీఎం నే ఉపయోగించారు. వీరహనుమాన్ నాట్యమండలి అంటూ స్టేజీ డ్రామా కంపెనీని పరిచయం చేస్తుండడం చూస్తుంటే నేపథ్యం ఇంకా మరింతగా రక్తి కట్టనుందనే అర్థమవుతోంది. హీరో ఫస్ట్ లుక్ డేర్ డెవిల్ ను ఆగస్టు 23న ఆవిష్కరించనున్నారు. అంటే చిరు బర్త్ డేకి మరునాడు అన్నమాట.

ఇంతకుముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది. ఇకపైనా ప్రచారం పరంగా మరింత మస్త్ మజా ట్రీట్ ఇస్తారని సమాచారం. కరోనా నేపథ్యంలో సరైన కాన్సెప్టుతో సినిమా ఏదీ లేదు. ప్రస్తుతం దేశం పరిస్థితి చూస్తుంటే మానవులే జాంబీలు అని డిక్టేర్ చేయాల్సిన దారుణ సన్నివేశం ఉంది. అసలు జాంబీ సినిమాల కాన్సెప్టే వైరస్ తో మనిషి పునర్జన్మ. అన్నట్టు ఈ జాంబీ మూవీలో మెగా బాస్ ని కూడా ఒక జాంబీగా చూపించి సడెన్ ట్విస్టిస్తున్నారా ఏమిటి?