యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

గింజలు లేని పుచ్చకాయల పంట.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు?

0

దేశంలోని చాలామంది రైతులు పంటలు పండించి లాభం రాకపోయినా కనీసం పెట్టబడి వస్తే చాలని భావిస్తున్నారు. కొంతమంది రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో కొత్త పంటలపై దృష్టి పెట్టారు. గింజలు లేని పండ్లను పండించడానికి రైతులు ఆసక్తి చూపిస్తుండగా ప్రజలు సైతం ఇలాంటి పండ్లను తినడానికి ఇష్టపడుతున్నారు. దేశంలోని చాలామంది రైతులకు గింజలు లేని పుచ్చ పంట మంచి లాభాలను అందిస్తోంది.

అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డెవలప్ చేసింది. అయితే కేరళ అగ్రికల్చర్ వర్శిటీ విత్తనాలు లేని పుచ్చగింజలను తయారు చేసి షోనిమా, స్వర్ణగా పేర్లతో మార్కెట్ లోకి వీటిని అందుబాటులోకి తెచ్చింది. ప్రతి సంవత్సరం వేసవికాలంలో రుచిగా ఉండే పుచ్చకాయలు మార్కెట్ లోకి దిగుమతి అవుతాయి. మల్చింగ్, డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో ఈ పుచ్చకాయలను సాగు చేయడం జరిగింది.

రైతులకు ఈ పుచ్చకాయలను పండించడం ద్వారా ఎక్కువ లాభాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు చేస్తే 1,20,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కేరళ అగ్రి వర్సిటీ వెబ్ సైట్ ద్వారా ఈ విత్తనాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం.

కేరళలోని త్రిచూరు రైతులు పుచ్చపంట మంచి లాభాలను అందిస్తోందని చెప్పుకొచ్చారు. సీడ్ లెస్ పుచ్చసాగుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కరణాటక ప్రాంతాల్లోని నేలలు ఈ పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి.