ఏప్రిల్ 9న షర్మిల పార్టీ పేరు ప్రకటన!

0

ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఊహాగానాలకు తెరపడబోతోంది. ఏప్రిల్ 9న ఆమె పార్టీ ప్రకటన చేయబోతున్నట్టు తెలిసింది. ఆ రోజు ఖమ్మం వేదికగా జరుగనున్న ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ పేరుతోపాటు విధి విధానాలను ఆమె ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే పార్టీ ప్రకటనపై జిల్లాల నేతలతో షర్మిల సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. వైఎస్ఆర్.టీపీ వైఎస్ఆర్ పీటీ రాజన్న రాజ్యం అనే మూడు పేర్లను షర్మిల పరిశీలిస్తున్నట్టు సమాచారం.

అన్నీ ఓకే అయితే మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.

వైఎస్ జగన్ తో విభేదించి షర్మిల పార్టీ పెట్టబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే షర్మిల పెట్టడం జగన్ కు ఇష్టం లేదని ఏపీ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి ప్రకటించారు కూడా. టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ఆమె పార్టీ ఉండబోతున్నట్టు సమాచారం.