కంగనా రౌనత్ కు ముంబై కోర్టు షాక్!

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ చిక్కుల్లో పడింది. ఆమెకు ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కంగనకు ఎదురుదెబ్బ తగిలింది.కంగనా తీరుపై ముంబై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ మరణం తర్వాత బాలీవుడ్ లో జావేద్ అఖ్తర్ నాయకత్వంలో ఓ కోటరీ పనిచేస్తోందని.. వారి కారణంగానే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయని కంగనా సంచలన ఆరోపణలు చేసింది.దీనిపై సీరియస్ అయిన జావేద్ తాను చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని.. నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా బాధ కలిగించిందని ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఈ క్రమంలోనే మార్చి1న కోర్టులో హాజరు కావాలని కోర్టు కంగనకు సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లపై కంగనా రౌనత్ స్పందించకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. కంగనకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ కేసును మార్చి 26వ తేదికి వాయిదా వేసింది.